Ads
తెరపై తమ అభినయం తో కోట్లాది మంది అభిమానులను మెప్పించి.. వారిని అలరిస్తారు నటులు. వారిపై ఉన్న అభిమానంతో హీరోలను దేవుళ్ళలా కొలుస్తారు ప్రేక్షకులు.
Video Advertisement
అలాగే కొందరు హీరోలు తమకు ప్రజలు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులు, డబ్బును తిరిగి ప్రజల బాగు కోసం వెచ్చించి నిజ జీవితం లో కూడా హీరో లుగా నిరూపించుకుంటున్నారు.. ఇప్పుడు వారెవరో చూద్దాం..
#1 చిరంజీవి – బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్
మెగాస్టార్ గా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న చిరంజీవి ..బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ల ద్వారా తన ఫాన్స్ తో బ్లడ్ డొనేషన్స్ చేయిస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు.
#2 బాలకృష్ణ – బసవతారకం ఇండో-అమెరికన్ కాన్సర్ హాస్పిటల్
సీనియర్ ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకం గారు కాన్సర్ తో చనిపోవడం వల్ల ఎన్టీఆర్ గారు ఈ హాస్పిటల్ ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ హాస్పిటల్ కి బాలయ్య బాబు చైర్మన్ గా ఉన్నారు.చిన్న పిల్లలు, మిడిల్ ఏజ్ , ముసలి వాళ్ళకి ఫ్రీ గా కాన్సర్ సర్జరీస్ చేయిస్తున్నారు బాల కృష్ణ.
#3 మహేష్ బాబు – ఉచితముగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు
2016లో ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు మహేష్. మహేష్ చేసే ముఖ్యమైన సేవా కార్యక్రమం చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్. ఇప్పటివరకు దాదాపు గుండె సంబంధిత సమస్యలు ఉన్న 1000 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఆ పిల్లల తల్లిదండ్రులు మహేష్ ని దేవుడిగా చూస్తారు.
#4 పవన్ కళ్యాణ్ – పలువురికి ఆర్ధిక సాయం
పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లో పావలా శ్యామల ,సర్దార్ గబ్బర్ సింగ్ టెక్నీషియన్ కి ఫైనాన్సియల్ గా చాలా హెల్ప్ చేసారు. ఇలా సినిమా వాళ్ళకే కాకుండా బయట చాలా సొసైటీస్, ఛారిటీలకు ఆర్ధిక సాయం చేసారు.
#5 అక్కినేని నాగార్జున, అమల – బ్లూ క్రాస్
అక్కినేని అమల, నాగార్జున ఇద్దరూ మూగ జంతువుల కోసం ‘బ్లూ క్రాస్ అఫ్ హైదరాబాద్ ’ ని స్టార్ట్ చేసి మూగ జీవాలను సంరక్షిస్తున్నారు.
#6 ప్రభాస్ – అంధుల పాఠశాలలకు విరాళం
ప్రభాస్ ఒక బ్లైండ్ స్కూల్ కి 10 లక్షలువిరాళం ఇవ్వడంతో పాటు అందులో కొందరు స్టూడెంట్స్ బాగోగులు అన్ని చూసుకుంటున్నారు.
#7 ప్రకాష్ రాజ్ – ఒక గ్రామం దత్తత
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తెలంగాణ లోని కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు.
#8 సుమన్ – ఒక గ్రామం దత్తత
సీనియర్ నటుడు సుమన్ తెలంగాణ లోని ఒక మరు మూల పల్లె అయిన సుద్దపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
#9 సూర్య – అగరం ఫౌండేషన్
తమిళ్ స్టార్ హీరో సూర్య మంచి నటుడే కాదు, మంచి మనసున్న వ్యక్తి అని కూడా చాలా సార్లు తెలియచేశాడు. తన భార్య జ్యోతికతో కలిసి అగరం ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సూర్య. కరోనా సమయంలోను పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
#10 రాఘవ లారెన్స్
లారెన్స్ సామజిక సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ అనాథ శరణాలయాన్ని నిర్వహించడంతో పాటు తన ట్రస్ట్ ద్వారా ఎందరికో ప్రాణదానం చేస్తున్నారు లారెన్స్.
#11 పునీత్ రాజ్ కుమార్
కన్నడ ఇండస్ట్రీకి చెందిన పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అకస్మాత్తుగా మరణించారు. పునీత్ తన 46 ఏళ్ల జీవితంలో 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధ శరణాలయాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలను నిర్మించడంతో పాటు.. 1800 మంది స్టూడెంట్స్ కి ఉచిత విద్యను అందించారు. పునీత్ మరణానంతరం ఆ విద్యార్థుల బాధ్యత తాను తీసుకుంటా అని తమిళ నటుడు విశాల్ ప్రకటించారు.
End of Article