ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో హీరోయిన్లతో పాటు ప్రతినాయకుడి పాత్ర కూడా ముఖ్యమే.. ఈ పాత్రలకు సరైన నటుల ఎంపిక లోనే సగం సినిమా విజయం దాగి ఉంటుంది. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే..హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. హీరో హీరోయిన్ ఏ విధంగా అయితే ప్రేక్షకులను అలరిస్తారో అదే రేంజ్ లో ప్రతి నాయకుడి పాత్ర కూడా ఉంటుంది.
Video Advertisement
అయితే సాధారణం గా కమర్షియల్ గా రూపొందించబడిన అన్ని తెలుగు సినిమాలలోను హీరో నే హై లైట్ అవుతుంటారు. జస్ట్ ఫర్ ఏ చేంజ్, కొన్ని సినిమాలలో విలన్లను హీరోల కంటే పవర్ ఫుల్ గా చూపించడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే కొందరు హీరోలు విలన్లు గా కూడా నటించి తమలోని అన్ని కోణాలను బయటకు చూపిస్తున్నారు.
ఇప్పుడు అలా హీరోలుగా కంటే విలన్స్ గా ఫేమస్ అయిన హీరోలెవరో చూద్దాం..
#1 జగపతి బాబు
ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సిన పేరు జగపతి బాబు దే. ఫామిలీ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈయనని ఒక విలన్ గా మనం అస్సలు ఊహించలేము. కానీ లెజెండ్ మూవీ తో జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు.
#2 అర్జున్ సర్జా
పలు చిత్రాల్లో హీరోగా నటించిన అర్జున్ ప్రస్తుతం విలన్ గా చేస్తూ.. మెప్పిస్తున్నారు.
#3 అరవింద స్వామి
90 వ దశకం లో యువతుల డ్రీం బాయ్ అయిన అరవింద స్వామి.. ప్రస్తుతం స్టైలిష్ విలన్ గా నటిస్తున్నారు.
#4 మాధవన్
అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడైన మాధవన్ ‘సవ్యసాచి’ చిత్రం తో విలన్ గా తన ప్రస్థానం ప్రారంభించారు.
#5 శ్రీకాంత్
కెరీర్ మొదట్లో విలన్ గా చేసిన శ్రీకాంత్ ఆ తర్వాత ఫామిలీ మాన్ ఇమేజ్ తో హిట్స్ కొట్టారు. ఆయన ‘యుద్ధం శరణం’, ‘అఖండ’ చిత్రాల్లో తన విలనిజం తో మెప్పించారు.
#6 ఎస్ జె సూర్య
పలు చిత్రాల్లో హీరోగా నటించిన నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య స్పైడర్ సినిమా తో విలన్ గా మారాడు.
#7 రానా దగ్గుబాటి
లీడర్ సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా.. బాహుబలి చిత్రం లో విలన్ గా నటించి తన విశ్వరూపాన్ని చూపించాడు.
#8 విజయ్ సేతుపతి
సినిమాల్లో చాలా కస్టపడి హీరోగా ఎదిగిన విజయ్ సేతుపతి ఉప్పెన, మాస్టర్, విక్రమ్ చిత్రాల్లో తన విలనిజం తో భయపెట్టారు.
#9 ఆది పినిశెట్టి
పలు తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా నటించిన ఆది పినిశెట్టి సరైనోడు చిత్రం తో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.
#10 కార్తికేయ
పలు సూపర్ హిట్ చిత్రాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న కార్తికేయ..’గ్యాంగ్ లీడర్, వలిమై’ చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించాడు.
#11 నవీన్ చంద్ర
అందాల రాక్షసి చిత్రం తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించారు.
#12 వినయ్ రాయ్
తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో హీరోగా నటించిన వినయ్ ప్రస్తుతం విలన్ పాత్రల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.