“జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు” తో పాటు… తమ తల్లి / తండ్రిని పోగొట్టుకున్న 10 హీరోస్..!

“జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు” తో పాటు… తమ తల్లి / తండ్రిని పోగొట్టుకున్న 10 హీరోస్..!

by Anudeep

Ads

తెరపై అన్ని పాత్రల్లో ఒదిగిపోతూ మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తున్న సెలెబ్రెటీల జీవితాల్లోనూ బాధ పడ్డ క్షణాలుంటాయి. వారు ఎంతగానో ప్రేమించే తల్లి తండ్రులో లేదా సన్నిహితుల్లో వాళ్ళని విడిచి పెట్టిన సందర్భాల్లో కూడా వాళ్ళు మనల్ని అలరిస్తూనే ఉంటారు.ఎంతో బాధను గుండెల్లో పెట్టుకొని తెరపై కనిపించే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మనల్ని మెప్పిస్తారు వాళ్లు. అది వాళ్ళకి సినిమా పై ఉన్న డెడికేషన్.

Video Advertisement

మనకు తెలిసినంతవరకు సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక రోజు షూటింగ్లో ఉన్న సమయం లోనే ఆయన కుమారుల్లో ఒకరు మరణించారని వార్త ఆయన్ను చేరింది. కానీ ఆ రోజు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాతే ఆయన ఇంటికి పయన మయ్యారు. ఇటువంటి డెడికేషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాగే కొందరు హీరోలకు తల్లి లేదా తండ్రి మరణించి ఉంటారు. వాళ్ళు కూడా ఆ బాధను దిగమింగుకొని కొద్దీ రోజుల్లోనే తిరిగి షూటింగ్ లకు హాజరు అయ్యేవారు. ఇప్పడు వారెవరో చూద్దాం..

#1 చిరంజీవి, పవన్ కళ్యాణ్

actors who lost their parents
ప్రభుత్వ ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయ్యారు చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు. ఆయన 2007 లో గుండె సంబంధిత సమస్యలతో మరణించారు.

#2 నాగార్జున

actors who lost their parents
కింగ్ నాగార్జున తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వర రావు, అన్నపూర్ణ ఇరువురు మరణించారు.
2011 అక్కినేని అన్నపూర్ణ గారు అనారోగ్య సమస్యలతో మరణించగా, ఆ తర్వాత 2014 జనవరిలో అక్కినేని నాగేశ్వరరావు కాన్సర్ తో మరణించారు.

#3 మహేష్ బాబు

actors who lost their parents
మహేష్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య అయినా ఇందిరా దేవి గారు ౨౦౨౨ సెప్టెంబర్ లో మరణించారు.

#4 ప్రభాస్

actors who lost their parents
పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు 2010 లో మరణించారు. ఈయన తన సోదరుడు కృష్ణం రాజు హీరోగా ‘భక్త కన్నప్ప’, ‘తాండ్ర పాపారాయుడు’ వంటి చిత్రాలను నిర్మించారు.

#5 వెంకటేష్

actors who lost their parents
వెంకటేష్ తండ్రి డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ౨౦౧౫ లో కాన్సర్ తో పోరాడుతూ 2015 లో మరణించారు. శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు.

#6 ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

actors who lost their parents
సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు, నటుడు అయిన హరికృష్ణ ఒక ప్రమాదం లో మరణించారు. ఈయనకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, జానకి రామ్ కుమారులు.

#7 బాలకృష్ణ

actors who lost their parents
తెలుగు జాతి కీర్తి పతాక అయిన నందమూరి తారక రామారావు గారు 1995 లో అనారోగ్యం తో మరణించారు.

#8 శ్రీకాంత్


పలు సినిమాల్లో హీరో, సహాయ నటుడి పత్రాలు చేసిన శ్రీకాంత్ తండ్రి 2020 లో ఊపిరితిత్తుల సమస్యతో మరణించారు.

#9 గోపీచంద్

actors who lost their parents
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తొట్టెంప్పుడి కృష్ణ గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మే 8, 1987 న మరణించాడు.

#10 నిఖిల్ సిద్దార్థ్

actors who lost their parents
నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ్ ఈ ఏడాది ఏప్రిల్ లో అనారోగ్య సమస్యలతో మరణించారు.


End of Article

You may also like