బాలీవుడ్ అగ్ర హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’. సెప్టెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ మూవీ తొలి షోతో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Video Advertisement

విడుదల అయ్యి వారం గడవక ముందే రూ. 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన జవాన్ వెయ్యి కోట్ల వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో  షారుఖ్ తో పాటు దర్శకుడు అట్లీ పేరు మారుమోగుతుంది. అయితే ఈ మూవీ కథను ముందుగా తెలుగు హీరోలకు అట్లీ వినిపించగా వారు రిజెక్ట్ చేశారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
jawan-prevueబాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, లేడి సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన సినిమా జవాన్. విజయ్  సేతుపతి విలన్ గా నటించిన ఈ మూవీలో గెస్ట్ రోల్స్ లో దీపికా పదుకొనే, సంజయ్ దత్ నటించారు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ ఈ మూవీని తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జవాన్ ఆరు రోజుల్లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తెలుగులోనూ బ్రేక్ ఈవెన్ అవడమే కాకుండా పెట్టిన దానికన్నా డబుల్ లాభాలను సాధించినట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ గురించి తాజాగా ఒక వార్త  వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లీ ఈ మూవీ కథను షారూఖ్ ఖాన్ కోసం రెడీ చేయలేదంట. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం సిద్ధం చేసారంట. డైరెక్టర్ అట్లీ ఈ కథను ముందుగా మహేష్ బాబు చెప్పారంట.
జవాన్ కథ మహేష్ బాబుకి బాగా నచ్చిందని, కానీ కాల్ షీట్స్ లేకపోవడంతో సున్నితంగా ఈ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ కు ముందు, ఆ తరువాత మహేష్ బాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ తరువాత అట్లీ ఈ స్టోరీని రామ్ చరణ్ కి వినిపించారంట. అయితే డిఫరెంట్ కథతో రిస్క్ చేయడానికి ముందుకు రాలేదట. ఆ తరువాత అట్లీ షారూఖ్ ఖాన్ కి కథ చెప్పడం, ఆయనకు నచ్చి ఒకే చేయడంతో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ ఏడాది షారుక్ కి రెండవ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Also Read: “బేబీ” మూవీలో “వైష్ణవి భర్త” గా నటించిన అబ్బాయి ఎవరో తెలుసా..?