సాధారణంగా సినిమాల్లో ఒక హీరో కోసం కథ రాసుకోవడం ఇక ఆ తర్వాత ఆ సినిమాను వేరే హీరోతో తెరకెక్కించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ రాజమౌళి విషయం లో మాత్రం దీనికి భిన్నం. రాజమౌళి ఒక హీరోతో సినిమా చేయాలనుకుంటే ఆ హీరోతోనే సినిమా చేస్తాడు. లేదంటే ఆ కథని పక్కకు పెట్టేస్తూ ఉంటానని రాజమౌళి ఇది వరకు చాలా సందర్భాల్లో చెప్పారు.
Video Advertisement
కానీ తెలుగు జాతి కీర్తిని అంతర్జాతీయం గా చాటి చెప్పి.. ఆస్కార్ ని గెలుచుకున్న ఆర్ఆర్ఆర్’ సినిమా విషయం లో మాత్రం దీనికి భిన్నం గా జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు సెట్ కారేమో అన్నంతగా ఆ సినిమా ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా కథ ని ముందుగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను దృష్టిలో పెట్టుకుని రాయలేదట. ఈ విషయాన్నీ స్టోరీ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ గతం లో వెల్లడించారు.
ఈ నేపథ్యం లో రాజమౌళి ఈ సినిమాలో హీరోలుగా ఎవరెవరిని అనుకున్నారో ఇప్పుడు చూద్దాం..
#1 రజనీకాంత్ – అర్జున్
సూపర్ స్టార్ రజనీకాంత్, యాక్షన్ కింగ్ అర్జున్ లను ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రాన్ని చేయాలనుకున్నారట రాజమౌళి.
#2 సూర్య – కార్తీ
తమిళ హీరోలు అలాగే అన్నదమ్ములైన సూర్య, కార్తీలు ఈ చిత్రం లో నటిస్తే బావుంటుందని రాజమౌళి భావించారట.
#3 అల్లు అర్జున్ – కార్తీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హీరో కార్తీ జంటను కూడా ఈ సినిమా కోసం పరిశీలించారట రాజమౌళి.
#4 రజనీకాంత్ – కమల్ హాసన్
దిగ్గజ నటులైన రజని కాంత్, కమల్ హాసన్ లను కూడా ఈ సినిమా కి మొదట అనుకున్నారట.
#5 పవన్ కళ్యాణ్
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం లోని ఇద్దరు హీరోల్లో ఒక పాత్ర ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని హీరో గా అనుకున్నారట రాజమౌళి. కానీ పవన్ తో సరిపడే మరో స్టార్ హీరో లేకపోవడం తో ఆ ఆలోచన పక్కన పెట్టేశారట.
#6 ఎన్టీఆర్ – రామ్ చరణ్
ఇక చివరికి ‘ఆర్ఆర్ఆర్’ హీరోల కోసం వెతుకులాట వీరిద్దరి దగ్గరకు వచ్చి ఆగిందట. నిజజీవితంలో కూడా వీరిద్దరూ మంచి స్నేహితులు కావటం తో ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతారని జక్కన్న భావించారట. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎన్నో అంతర్జాతీయ అవార్డులతో పాటు ఆస్కార్ ని కూడా గెలుచుకుంది.