ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ కి ఇప్పటికి మంచి ఫాలోయింగ్ ఉంది. 1990 లలో కరిష్మా కపూర్ కు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. ప్రేమ ఖైదీ సినిమా హిందీ లో రీమేక్ చేసారు. ఈ రీమేక్ సినిమా తో కరిష్మా కి బాలీవుడ్ లో ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే, పెళ్లి చేసుకున్న తరువాత మాత్రం సినిమాలకు దూరమైంది. అంత రేంజ్ ఉండి, పెళ్లి అయ్యాక మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది కరిష్మా.

sanjay karishma kapoor 1

ఇటీవల, ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు. తన పెళ్లి గురించి, పెళ్లి అయిన తరువాత తానూ పడ్డ ఇబ్బందుల గురించి ఓపెన్ అయిపోయింది. పెళ్లి కి ముందు వరకు ఉన్న చరిష్మా, పెళ్లి అయిపోగానే మారిపోయిన పరిస్థితులు, అన్ని చెప్పుకొచ్చింది. తన జీవితం లో తానూ చేసిన తప్పు పెళ్లి చేసుకోవడమే అనే బరస్ట్ అయిపోయింది. పెళ్లి అయ్యాక, బాధ పడని రోజు లేదని పేర్కొంది. అందరి జీవితం లో హనీమూన్ ఓ మధురమైన ఘట్టమని, తన జీవితం లో మాత్రం పీడకల అని పేర్కొంది.

sanjay karishma

పెళ్ళైన వెంటనే, భర్త సంజయ్ కపూర్ తనను వేధించడం మొదలు పెట్టాడని తెలిపింది. తన స్నేహితులతో తనను పడుకోమని బెదిరించేవాడని చెప్పుకొచ్చారు. మానసికంగానూ, శారీరకం గాను తనను హింసించేవాడని కరిష్మా చెప్పుకొచ్చారు. హనీమూన్ సమయం లో నే అతని స్నేహితుల ముందు తనను వేలం వేసి ధరను కోట్ చేసాడని తన ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి అయ్యాక కూడా, మొదటి భార్యతో సంబంధాలు కొనసాగించడాన్ని తెలిపింది. సంజయ్ ఒక్కడే కాకుండా, అతని తల్లి కూడా తనను వేధించినట్లు కరిష్మా ఆరోపించింది. దాదాపు మూడేళ్లు భరించి విడిపోయినట్లు పేర్కొంది. సంజయ్, కరిష్మా లు 2013 లో పెళ్లి చేసుకుని, 2016 లో విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, పిల్లలిద్దరూ కరిష్మా వద్దే ఉంటున్నారు. కరిష్మా తో విడిపోయాక సంజయ్ ప్రియా సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నారు.