Ads
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎందరో తమ కలలని నెరవేర్చుకోవడానికి వస్తుంటారు. కొందరు సాగినంత కాలం కొనసాగి తరువాత ఇండస్ట్రీ ని వదిలేసి వెళ్లిపోతుంటారు. అయితే.. అవకాశం వస్తే తమని తాము ప్రూవ్ చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలా తనకి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని తక్కువగా కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటులలో సంఘవి ఒకరు.
Video Advertisement
ఈమె తొలిసారిగా తమిళనాట అజిత్ తో కలిసి ఓ సినిమాలో నటించారు. ఆ తరువాత తెలుగునాట కూడా నటించి పాపులర్ హీరోయిన్ అయిపోయారు. తమిళ్, తెలుగు, కన్నడ , హిందీ సినిమాలలో సంఘవి నటించారు.
తాజ్ మహల్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సంఘవి దాదాపు 23 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో కొనసాగారు. వెంకటేష్ తో నటించిన “సూర్య వంశం” మూవీ తో సంఘవికి చాలా పేరు వచ్చింది. తెలుగు నాట ఆమెకు మరిన్ని అవకాశాలను తీసుకొచ్చింది ఈ సినిమా. స్టార్ హీరోయిన్ గా ఉండగానే సంఘవి ఓ స్టార్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
1998 లో రిలీజ్ అయిన “శివయ్య” సినిమాలో నటించే సమయంలోనే ఆ సినిమా దర్శకుడు సురేష్ వర్మను సంఘవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. వీరి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. సురేష్ వర్మ పెట్టిన ఇబ్బందుల్ని ఆమె భరించలేక సురేష్ వర్మ నుంచి విడిపోయారు. ఆ తరువాత బెంగళూరు కు చెందిన వెంకటేష్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సంఘవి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే తన 42 సంవత్సరాల వయసు లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఫోటో లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
End of Article