టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు లో సూపర్ హిట్ అయిన “ఛత్రపతి” సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ సినిమా ద్వారా బెల్లం కొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో తెరంగ్రేటం చేయనున్నారు. కాగా.. ఈ ఛత్రపతి రీమేక్ కు సంబంధించి ఇటీవలే పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యారు.

bollywood chatrapthi

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఏమి రాలేదు. ఐతే.. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు ఉంటారన్న విషయమై తెలుగు ఆడియన్స్ కొంచం క్యూరియాసిటీ తోనే ఉన్నారు. తాజాగా.. ఈ ప్రశ్న కి ఆన్సర్ దొరికేసింది. బాలీవుడ్ లో రీమేక్ కానున్న ఛత్రపతి సినిమా లో రెజినా ను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. తొలుత బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవాలని భావించారు. కానీ కుదరకపోవడం తో టాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నారట.