నాగార్జునకి ఫ్రెండ్‌గా, హీరోయిన్‌గా, తల్లిగా నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?

నాగార్జునకి ఫ్రెండ్‌గా, హీరోయిన్‌గా, తల్లిగా నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?

by Harika

Ads

సినిమాలు అన్న తర్వాత హీరో, హీరోయిన్లు ఎలాంటి పాత్రలు అయినా చేయాల్సి ఉంటుంది. నిజ జీవితంలో వాళ్ళ వయసు ఒకటి అయితే, సినిమాలో మరొక వయసు పాత్రలో నటించాల్సి వస్తుంది. కానీ వాళ్లు నటనని కేవలం ఒక ప్రొఫెషన్ గా మాత్రమే భావిస్తారు. అందులో జరిగే ఏ విషయాలు కూడా వ్యక్తిగతంగా తీసుకోరు. అందుకే సినిమాలో ఎలాంటి వయసు పాత్ర అయినా సరే పోషిస్తూ ఉంటారు. ఎలాంటి వరుస పాత్ర అయినా సరే పోషిస్తూ ఉంటారు. ఒక సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన వారు, మరొక సినిమాలో అన్నా చెల్లెలుగా కూడా నటించిన సినిమాలు ఉంటాయి.

Video Advertisement

అది కేవలం నటన మాత్రమే అని వారు భావిస్తారు. అందుకే కేవలం వారి పాత్ర మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. అయితే, అలా ఒక నటి నాగార్జునకి స్నేహితురాలిగా, నాగార్జున పక్కన హీరోయిన్ గా, మరొక సినిమాలో నాగార్జునకి తల్లిగా నటించారు. ఈ హీరోయిన్ తో నాగార్జునకి మంచి స్నేహం కూడా ఉంది. రమ్య కృష్ణన్, నాగార్జున నటించిన చాలా సినిమాల్లో నటించారు. నాగార్జున హీరోగా నటించిన క్రిమినల్ సినిమాలో రమ్య అనే పాత్రలో రమ్య కృష్ణన్ నటించారు. రమ్య కృష్ణన్, మనిషా కోయిరాలాకి ఫ్రెండ్. ఆ తర్వాత నాగార్జునకి కూడా స్నేహితురాలు అవుతారు. కానీ నాగార్జున అంటే రమ్య కృష్ణన్ కి ఆ సినిమాలో ఇష్టం ఉంటుంది.

the glamourous photos of senior heroine ramya krishna..

ఎన్నో సినిమాల్లో వీళ్లిద్దరూ హీరో, హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. వీళ్లది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ అని అంటారు. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనలో సినిమాలో ఒక నాగార్జునకి తల్లి పాత్రలో కూడా నటించారు రమ్య కృష్ణన్. అలా నాగార్జునకి ఒక సినిమాలో స్నేహితురాలిగా, ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా, ఒక సినిమాలో తల్లిగా నటించారు. వీళ్ళిద్దరూ బయట కూడా చాలా మంచి స్నేహితులు. ఒకరి పుట్టినరోజుకి ఒకరు విష్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి బిగ్ బాస్ లో నాగార్జున షూటింగ్ లో ఉన్నప్పుడు ఆ ప్రోగ్రాంకి రమ్య కృష్ణన్ హోస్ట్ గా వ్యవహరించారు. రెండు ఎపిసోడ్లకి రమ్య కృష్ణన్ వచ్చారు. అవి చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఎన్నో సినిమాల్లో కూడా వీళ్ళు కలిసి నటించారు.

ALSO READ : “ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పి క్లైమాక్స్‌లో ఇలా చేశారేంటి..?” అంటూ… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమా మీద వ్యాఖ్యలు..! ఈ సీన్ గమనించారా..?


End of Article

You may also like