సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి టాలీవుడ్ లో అప్పట్లో ఒక ఉండేది. ఆయన పక్కన ఏ హీరోయిన్ నటించినా వారి దశ తిరుగుతుందని, అదృష్టం కలిసి వచ్చి ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లు అవుతారని భావించేవారు.
Video Advertisement
అయితే అది చాలామంది హీరోయిన్ల విషయంలో నిజం కూడా అయ్యింది. శ్రీదేవి, జయప్రదతో పాటు పలువురు హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా ఎదిగారు. అగ్రహీరోయిన్స్ మారిన 10 మంది హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. వాణిశ్రీ:
చంద్రమోహన్ మొదటి సినిమా రంగులరాట్నం. ఈ మూవీలో వాణిశ్రీ ఆయనకి జంటగా నటించింది. ఆ తరువాత కాలంలో టాప్ హీరోయిన్ గా ఎదిగారు.
2.విజయనిర్మల:
చంద్రమోహన్ నటించిన బంగారు పిచ్చుక మూవీలో విజయనిర్మల హీరోయిన్ గా చేశారు. ఆ తరువాత రెండు, మూడు సినిమాలలో నటించారు.
3. చంద్రకళ:
1973 లో చంద్రమోహన్ హీరోగా వచ్చిన మనువు మనసు, అమ్మాయిల శపధం సినిమాలలో చంద్రకళ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత కాలంలో అగ్ర హీరోయిన్ ఎదిగారు.
4. జయప్రద:
కళాతపస్వి కె. విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సిరి సిరి మువ్వ సినిమాలో చంద్రమోహన్ హీరోగా నటించగా, జయప్రద హీరోయిన్ గా చేసింది. ఆ తరువాతి కాలంలో ఆమె తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో ను స్టార్ హీరోయిన్ గా రాణించారు.
5. తాళ్ళూరి రామేశ్వరి:
చంద్రమోహన్ హీరోగా కె. విశ్వనాధ్ తెరకెక్కించిన ఈ మూవీ ద్వారా తాళ్ళూరి రామేశ్వరి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించింది.
6. శ్రీదేవి:
1978లో రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించిన పదహారేళ్ళ వయసు మూవీలో చంద్రమోహన్ పక్కన శ్రీదేవి నటించింది. ఆమె భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా రాణించిన విషయం తెలిసిందే.
7. మాధవి:
చంద్రమోహన్ హీరోగా నటించిన ఒక చల్లని రాత్రి సినిమాలో మాధవి హీరోయిన్ గా నటించింది.
8. జయసుధ:
1981 లో స్వర్గం అనే సినిమలో చంద్రమోహన్, జయసుధ నటించారు. ఆ తరువాత చాలా సినిమాలలో జంటగా నటించారు.
9. రాధిక:
బాపు దర్శకత్వం వహించిన రాధాకళ్యాణం మూవీలో చంద్రమోహన్, రాధిక జంటగా నటించారు.
10. విజయశాంతి:
చంద్రమోహన్ హీరోగా నటించిన ‘పెళ్లి చేసి చూపిస్తాం’ అనే సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించారు. ఆ తరువాతి కాలంలో టాప్ హీరోయిన్ గా ఎదిగారు.
Also Read: “పదహారేళ్ళ వయసు” సినిమాతో పాటు… “చంద్ర మోహన్” కి గుర్తింపు తీసుకొచ్చిన 13 సినిమాలు..!