“పదహారేళ్ళ వయసు” సినిమాతో పాటు… “చంద్ర మోహన్” కి గుర్తింపు తీసుకొచ్చిన 13 సినిమాలు..!

“పదహారేళ్ళ వయసు” సినిమాతో పాటు… “చంద్ర మోహన్” కి గుర్తింపు తీసుకొచ్చిన 13 సినిమాలు..!

by kavitha

Ads

ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ ఈరోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.  కొంతకాలంగా  అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న చంద్రమోహన్‌ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ, తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Video Advertisement

1966 లో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన చంద్రమోహన్‌ తన నటనతో చెరిగిపోని ముద్రను వేశారు. హీరోగా, సెకండ్ హీరోగా, సహాయ నటుడుగా , కమెడియన్  గా ఎన్నో పాత్రలలో నటించిన అలరించారు. 932 పైగా చిత్రాలలో నటించిన చంద్రమోహన్‌ కి గుర్తింపు తెచ్చిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..1. రంగుల రాట్నం:

ఈ చిత్రం ద్వారానే చంద్రమోహన్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో రాంమెహన్, అంజలి దేవీ, విజయ నిర్మల నటించారు.

2. సిరి సిరి మువ్వ:

కళాతపస్వి కే. విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో చంద్రమోహన్‌, జయప్రద జంటగా నటించారు.

3. సీతా మహా లక్ష్మి:

చంద్రమోహన్‌ కళాతపస్వి కే. విశ్వనాధ్ దర్శకత్వంలో నటించిన రెండవ సినిమా ఇది. ఈ మూవీ ద్వారా తాళ్ళూరి రామేశ్వరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

4. పదహారేళ్ళ వయసు:

చంద్రమోహన్ ఈ మూవీలో అమాయకుడైన చంద్రంగా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా ద్వారానే  శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా మారారు.

5. శంకరాభరణం :

1980 లో   కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శంకరాభరణం రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. ఈ మూవీలో చంద్రమోహన్ కీలక పాత్రలో నటించాడు.

6. రెండు రెళ్ళు ఆరు:

జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, ప్రీతి, రజని లీడ్ రోల్స్ లో  నటించిన మూవీ రెండు రెళ్ళు ఆరు.

7. రామ్‌ రాబర్ట్ రహీమ్‌:

1980లో విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రామ్ రాబర్ట్ రహీమ్ లుగా కృష్ణ, రజినీ కాంత్, చంద్రమోహన్ నటించారు.

8 . చంటబ్బాయ్:

జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో చంద్రమోహన్ ముఖ్య పాత్రలో నటించి, అలరించారు.

9. చందమామ రావే:

రామోజీ రావు నిర్మించిన ఈ మూవీకి మౌళి దర్శకత్వం వహించారు. చంద్ర మోహన్, కల్పన జంటగా నటించారు.

10. ప్రతి ఘటన:

టి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1986 లో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయ్యింది. విజయశాంతి, చంద్రమోహన్ నటించారు.

11. వసంతం:

వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో చంద్రమోహన్  కళ్యాణి తండ్రి పాత్రలో నటించి, ఆకట్టుకున్నాడు.

12. మనసంతా నువ్వే:

2001 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీలో హీరో ఉదయకిరణ్ ని తండ్రి పాత్రలో చంద్రమోహన్  నటించారు.

13. 7/G బృందావన్ కాలనీ:

2004 లో రిలీజ్ అయిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరో తండ్రి పాత్రలో చంద్రమోహన్ జీవించారు. ఈ పాత్రలో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Also Read: BREAKING NEWS: ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత..


End of Article

You may also like