స్టార్ హీరోయిన్స్ అయిన సమంత, పూజా హెగ్డే, నిధి అగర్వాల్ లు ముగ్గురు తమదైన నటన, అందంతో వరుస సినిమాలతో తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. సమంత, పూజ హెగ్డే లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఇక నిధి అగర్వాల్ కోలీవుడ్ లో కొనసాగుతూ, అప్పుడప్పుడు తెలుగు చిత్రాలలో నటిస్తున్నారు. అయితే ఈ ముగ్గురి హీరోయిన్స్ మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా ఒకే హీరో సినిమాల ద్వారా తెలుగులో అడుగు పెట్టారు. మరి ఆ హీరో ఎవరో? ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

సాధారణంగా సినిమాలలో హీరోయిన్స్ ని దర్శకులే ఎంపిక చేసినప్పటికీ. తుది నిర్ణయం మాత్రం హీరోలదే. ఇది అందరికి తెలిసిన విషయమే. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసినవారిలో ప్రధమ స్థానంలో విక్టరీ వెంకటేష్ ఉంటారు. ఆయన తరువాత హీరో అక్కినేని నాగార్జున. అప్పట్లో వీరిద్దరు చాలా మంది కొత్త హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వీరి తరువాత నాగచైతన్య కూడా తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేష్ బాటలోనే తన చిత్రాల ద్వారా కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేశారు.నాగ చైతన్య తొలి చిత్రం జోష్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయింది.  కానీ కార్తీక ఆ సినిమా తరువాత పెద్దగా గుర్తింపును పొందలేకపోయిందినాగ చైతన్య రెండవ సినిమా ఏమాయ చేసావే. ఈ చిత్రంతో సమంత హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమా తరువాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో కలిసి నటించారు. సమంత, నాగ చైతన్యలు 2021లో విడాకులు తీసుకొన్న విషయం తెలిసిందేనాగ చైతన్య నటించిన బెజవాడ మూవీతో అమలా పాల్‌ను టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.ప్రస్తుతమ ఆమె దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం చిత్రంతో పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్‌గా రాణిస్తోంది.నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్’ చిత్రం ద్వారా మడోనా స్టెబాస్టియన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’మూవీతో మంజిమా మోహన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’సినిమాతో నిధి అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
నాగ చైతన్య, సమంత నటించిన మజిలీ చిత్రం ద్వారా దివ్యాంశ కౌశిక్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.Also Read: PHALANA ABBAYI PHALANA AMMAYI REVIEW : “నాగ శౌర్య, మాళవిక నాయర్” నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!