“జయసుధ” నుండి “సాయి పల్లవి” వరకు… “సహజ నటులు” గా గుర్తింపు పొందిన 13 హీరోయిన్స్..!

“జయసుధ” నుండి “సాయి పల్లవి” వరకు… “సహజ నటులు” గా గుర్తింపు పొందిన 13 హీరోయిన్స్..!

by Anudeep

Ads

సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తమ నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్నారు కొంతమంది కథానాయికలు.

Video Advertisement

ఇలా శరీర సౌందర్యంతోనే కాకుండా వారి సహజ నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకున్న కొంతమంది నటీమణులు గురించి ఇప్పుడు చూద్దాం . .

#1. సుహాసిని:


సుహాసిని తమిళ చిత్రాలతోనే అరంగేట్రం చేసినా.. తెలుగు చిత్రాలతో సూపర్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. క్రాంతి కుమార్ తెరకెక్కించిన ‘స్వాతి’ చిత్రంతో సుహాసిని ఉత్తమనటిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. తమిళ చిత్రం ‘సింధుభైరవి’తో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఏది ఏమైనా తెలుగునాట మాత్రం జనం మదిలో ‘నవ్వుల రాణి’గా ముద్రవేసుకున్నారు సుహాసిని.

#2. శోభన:

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్ర తారగా వెలుగొందుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు శోభన. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి అందరిని మెప్పించిన శోభన తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషలలో కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు. నాగార్జున విక్రమ్ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి.. చిరంజీవితో, బాలకృష్ణ, వెంకటేష్‌ తో నటించారు.

#3. జయసుధ:

jayasudha 2
ప‌ద్నాలుగేండ్ల వ‌య‌సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జ‌య‌సుధ‌.. త‌న‌దైన న‌ట‌న‌తో స‌హ‌జ న‌టిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఎన్నో సినిమాలు చేసింది. లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ కాలంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2019లో వ‌చ్చిన మ‌హ‌ర్షి, రూల‌ర్ సినిమాల త‌ర్వాత ఆమె సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది.

#4. భానుప్రియ:


అర్థం చేసుకోరూ..!! అంటూ విశాలమైన కళ్లను గిరగిరాతిప్పుతూ నర్తకిగా, అందాల అభినయ నటిగా సుదీర్ఘకాలం పాటు చిరంజీవి, వెంకటేష్, బాలక్రిష్ణ, సుమన్‌లకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చి ఆమె రూపంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు భానుప్రియ. దర్శకుడు వంశీ ‘సితార’ చిత్రంతో భానుప్రియను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వంశీ చెక్కిన శిల్పంగా ఇండస్ట్రీని ఏలింది ఈ అందాల తార.

#5. రేవతి:


చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కాసింత పరిచయం కాగానే యెద చుట్టేసుకుంటుంది. కళ్ళతోనే కోటి భావాలు పలికిస్తుంది. పెదాలు విప్పితే ఆమె ముత్యాల పళ్ళు పలకరిస్తాయి. వెరసి నటి రేవతి నవ్వు ఆకర్షిస్తుంది. అభినయం ఆకట్టుకుంటుంది. ‘అంకురం’ చిత్రంలో రేవతి నటనకు ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది. రామ్ గోపాల్ వర్మ’గాయం’లోనూ రేవతి తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు.

#6. సౌందర్య

ఇప్పటికి కూడా సౌందర్య అంటే ప్రేక్షకులందరికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఒక్క విషయం చాలు ఆమె ఎంత గొప్ప నటి అనేది చెప్పడానికి.

#7. రాధిక:


రాధిక అప్పటిలో చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది. ఇక తన అందం, కట్టుబొట్టు మొత్తం అచ్చమైన తెలుగు ఆడపడుచులా కనిపించడం ద్వారా కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 80, 90లో స్టార్‌ హీరోయిన్‌గా ఆమె సౌత్‌ ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. ఆమె దక్షిణాది అందరు స్టార్‌ హీరోలు, లెజెండరి నటులతో కలిసి నటించారు. ఇటీవల ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటించారు.

#8. ఆమని:


ఆమని ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. శుభలగ్నం,మిస్టర్ పెళ్ళాం, అమ్మ దొంగ వంటి చిత్రాలతో మెప్పించారు.

#9. స్నేహ:

ప్రియమైన నీకు చిత్రంతో తెలుగునాట ఎంట్రీ ఇచ్చిన స్నేహ తొలి చిత్రంతోనే సూపర్ హిట్‌ అందుకుంది.  ‘శ్రీ రామదాసు’, ‘సంక్రాంతి’,‘రాధా గోపాలం’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ తన అభినయం, చీరకట్టుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది స్నేహ.

#10. నిత్యా మీనన్:


అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్. ఇష్క్ సినిమాతో మంచి హిట్‌ అందుకుంది. మళ్లీ నితిన్‌తో నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. జబర్దస్త్, ఒక్కడినే, సన్నాఫ్ సత్య మూర్తి, గీత గోవిందం, ఇటీవల భీంమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. అయితే నిత్యాకి కథ నచ్చకపోతే సినిమా ఒప్పుకోదు అనే టాక్ ఎప్పుడూ వినిపిస్తుంది. పాత్ర విషయంలో అంత పక్కాగా ఉంటుంది నిత్య.

#11. సాయి పల్లవి:


నెమలిలా నాట్యం చేస్తూ.. నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. చేసే ప్రతి పాత్రలో చక్కగా ఒడిగిపోతుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల ఫిదా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ మలార్ టీచర్ టాలీవుడ్ లేడీ పవర్ స్టార్, సహజ నటి సౌందర్యగా పేరు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన విరాట పర్వం, గార్గిలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది సాయి పల్లవి.

#12. విద్యా బాలన్:

4 vidya balan
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలబోసిన రూపం.. స్టార్ హీరోయిన్లు కూడా చేయలేని పాత్రలను చేసి అందరి చేత శబాష్ అనిపించుకుంది విద్యా బాలన్.
ఈమె తన నటనరంగ ప్రవేశం సీరియళ్ళలో, వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా చేసారు. విద్య హిందిలో ఎక్కువ సినిమాల్లో నటించారు. తెలుగులొ ఎన్ టి ఆర్ కథానాయకుడు చిత్రంతొ తెరంగేట్రం చేసారు.

#13. నజ్రియా నజీమ్:


నజ్రియా నజీమ్.. రాజా రాణి డబ్బింగ్ సినిమాతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఆ సమయంలోనే నజ్రియా తెలుగులో అడుగుపెట్టొచ్చని అంతా అనుకున్నారు కానీ, అలా జరగలేదు. 2006లో పలుంకు అనే మలయాళ చిత్రంతో బాలనటిగా తొలిసారి నటించిన నజ్రియా, నేరం, ఓం శాంతి ఓషానా, బెంగళూర్ డేస్ వంటి విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్ గా నటించారు నజ్రియా. ఇటీవల అంటే.. సుందరానికీ చిత్రంతో తెలుగులో అడుగు పెట్టారు.

#14. ఐశ్వర్య రాజేష్:


తమిళ సినిమా రంగంలో తన సహజ నటనతో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్. ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మిస్ మ్యాచ్’ అనే సినిమాలోనూ నటించింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఐశ్వర్య నటించిన మూడో తెలుగు సినిమా. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ సువర్ణగా ఐశ్వర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇటీవల ఐశ్వర్య రాజేశ్‌ ‘సుడల్’ అనే వెబ్ సీరిస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది.


End of Article

You may also like