Ads
ప్రతి సినిమాలో హీరో పక్కన హీరోయిన్ కచ్చితంగా ఉంటారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కొన్ని సినిమాల్లో అంత పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ కొంచెం సేపు ఉన్నా కానీ వారి పాత్ర లు ప్రేక్షకులకి అలా గుర్తుండిపోతాయి. ఆ సినిమా గురించి చెప్పగానే ఆ హీరోయిన్ చెప్పిన మాటలే గుర్తు వస్తాయి.
Video Advertisement
అలా తమ పాత్రల పేరుతోనే ఫేమస్ అయినా హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
#1 పండు
కృష్ణ వంశి దర్శకత్వం లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున, టబు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ మూవీ లో పండు ప్రేక్షకులకి ఇప్పటికి ఫేవరేట్.
#2 జెస్సి
గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏమాయ చేసావే మూవీ లో సమంత, నాగ చైతన్య జంటగా నటించారు. ఇప్పటికి జెస్సి పేరు చెబితే సామ్ నే గుర్తొస్తుంది.
#3 భానుమతి
“భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల..” అంటూ ఫిదా మూవీ లో డైలాగ్ వినగానే గుర్తొచ్చేది సాయి పల్లవి. ఈ పాత్రతో ప్రేక్షకుల మనసులో మంచి స్థానం సంపాదించింది సాయి పల్లవి.
#4 హాసిని
ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది జెనీలియా. ఈ మూవీ ని ఎప్పుడు చూసిన హాసిని మనల్ని అంత ఈజీ గా వదిలిపెట్టదు.
#5 భ్రమరాంబ
రారండోయ్ వేడుక చూద్దాం మూవీ లో తన పెంకి తనం తో, మొండి తనం తో తనను ప్రేమించిన వాళ్ళని ఇబ్బంది పెట్టె పాత్రలో రకుల్ జీవించేసింది.
#6 హనీ
“హనీ ఇస్ ది బెస్ట్..” అంటూ మెహ్రీన్ మనల్ని ముప్పతిప్పలు పెడుతుంది ఎఫ్ 2 మూవీ లో.
#7 సీత
హను రాఘవపూడి దర్శకత్వం లో వచ్చిన సీతారామం చిత్రం ఎంత అంద్భుతం గా ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. ఈ మూవీ లో సీతా పాత్రని అంత ఈజీ గా మర్చిపోలేం.
#8 చిట్టి
జాతి రత్నాలు మూవీ లో హీరోలు ముగ్గురితో పాటు మనల్ని ఎంతో అలరించింది చిట్టి. ఈ పేరు చెప్తే మనకి ఆ కోర్ట్ లో సీన్ లు గుర్తొచ్చి నవ్వులు రావాల్సిందే.
#9 రూప
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మరో దృశ్య కావ్యం ‘ఆనంద్’. ఈ చిత్రం లో ఆత్మాభిమానం గల అమ్మాయిగా కమలిని ముఖేర్జీ నటన మనల్ని మెప్పిస్తుంది.
#10 మధు
ఖుషి మూవీ తో పవన్ కళ్యాణ్ ని ఎంత క్రేజ్ వచ్చిందో అంతే క్రేజ్ మధు కి కూడా వచ్చింది. ఆ పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది భూమిక.
#11 ప్రీతి
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత హీరోయిన్ షాలిని పాండే ఈ పేరుతో చాలా ఫేమస్ అయిపోయారు.
#12 బేబమ్మ
తన తొలి చిత్రం తోనే అందర్నీ తన వైపుకు తిప్పుకుంది బేబమ్మ. ఆ తర్వాత వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా మారింది మన క్రితి శెట్టి.
End of Article