“పరిణీతి చోప్రా” లాగానే… “రాజకీయ నాయకులని” పెళ్లి చేసుకున్న 5 హీరోయిన్స్..!

“పరిణీతి చోప్రా” లాగానే… “రాజకీయ నాయకులని” పెళ్లి చేసుకున్న 5 హీరోయిన్స్..!

by Anudeep

Ads

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ రావడం చాలా సహజం. ఈ యాక్టర్ వారితో ప్రేమలో ఉన్నారు.. ఈ యాక్టర్ వారిని పెళ్లిచేసుకోబోతున్నారు అంటూ పలు వార్తలు నిత్యం హల్చల్ చేస్తూ ఉంటాయి. అందుకే కొందరు నటులు తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచుతారు.

Video Advertisement

ఇక సినీ రంగంలో నటులు తోటి నటుల్ని, బిజినెస్ పర్సన్స్ ని పెళ్లి చేసుకోవడం చాలా మామూలు. అయితే కొందరు నటీమణులు మాత్రం నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నాయకులని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లెవరో చూద్దాం..

#1 రాధికా కుమారస్వామి

కన్నడ నటీమణి రాధిక.. మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామిని 2006 లో పెళ్లి చేసుకున్నారు. ఈమె కన్నడ తో పాటు పలు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించారు.

actresses who married politicians..!!

#2 స్వరా భాస్కర్

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.. సోషల్ మీడియా ద్వారా సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫహద్ జిరార్ అహ్మద్‌తో తన పెళ్లి జరిగిందని ప్రకటించారు.

actresses who married politicians..!!

#3 అయేషా టకియా

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన అయేషా టాకియా, 2009లో తన బాయ్‌ఫ్రెండ్, మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు అబూ అసిమ్ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతడు సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు.

actresses who married politicians..!!

#4 నవనీత్ కౌర్ రానా

పలు తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నవనీత్ కౌర్ ఆమె ఫిబ్రవరి 3, 2011న మహారాష్ట్రలో స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను సామూహిక వివాహం చేసుకుంది. రవి రాణా ప్రస్తుతం విదర్భ ప్రాంతంలోని అమరావతి జిల్లాలోని బద్నేరా (విధానసభ స్థానం) నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. నవనీత్ కౌర్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.

actresses who married politicians..!!

#5 పరిణీతి చోప్రా

బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా, AAP లీడర్ రాఘవ్ చద్దా నిశ్చితార్థం మే 13 (శనివారం) జరిగింది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

actresses who married politicians..!!


End of Article

You may also like