ఇండస్ట్రీ లో ఎప్పటికప్పుడు కొత్త నటులు వస్తూనే ఉంటారు. కానీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడవ్వాల్సిందే. ఒక హీరోయిన్ వరుసగా రెండు హిట్ సినిమాల్లో నటిస్తే ఇండస్ట్రీ ఆమె వెంట పడుతుంది.
Video Advertisement
ఒక్కసారి లక్కీ హ్యాండ్ అనే ముద్ర పడిందంటే, సదరు హీరోయిన్ లైఫ్ సెట్ అయిపోయినట్టే. వరుసపెట్టి అవకాశాలు, కళ్లుచెదిరే పారితోషికం క్యూ కడతాయి. ఇప్పుడు అలా టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తారలెవరో ఇప్పుడు చూద్దాం..
#1 సంయుక్త మీనన్
ప్రస్తుతం టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ ఎవరంటే సంయుక్త నే..పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ నుంచి.. తాజాగా వచ్చిన విరూపాక్ష వరకు ఈమె నటించిన నాలుగు చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమె పై లక్కీ హీరోయిన్ ముద్ర పడిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద సినిమాలు ఉన్నాయి.
#2 శ్రీ లీల
పెళ్లిసందడి చిత్రం తో టాలీవుడ్ కి పరిచయం అయినా ఈ భామ .. అటు అందం తో, డాన్స్ తో అలాగే అభినయం తో అందరి మనసులు కొల్లగొడుతోంది. ప్రస్తుతం ఈమె చేతిలో 8 పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.
#3 కృతి శెట్టి
ఈ లిస్ట్ లో ఉన్న మరో హ్యాపెనింగ్ బ్యూటీ కృతి శెట్టి. తన మొదటి చిత్రం తోనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈమె..హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ గా ఉంది కృతి.
#4 శృతి హాసన్
పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ తో శృతి హాసన్ ఐరన్ లెగ్ స్టేటస్ నుండి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. తర్వాత రామ్ చరణ్ ‘ఎవడు’తో సూపర్ హిట్ సాధించింది మరియు అల్లు అర్జున్ రేసు గుర్రంతో ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించింది.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు, బాలయ్య లకి హిట్స్ ఇవ్వడం తో పాటు.. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ చిత్రం లో కూడా నటిస్తోంది శృతి.
#5 రష్మిక మందన్న
ఇక రష్మిక చలో చిత్రం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ సమయం లోనే స్టార్ హీరోలందరితో నటించింది రష్మిక.
#6 సమంత
తొలి తెలుగు చిత్రం ‘ఏ మాయ చేసావే’. తొలి చిత్రంతోనే జెస్సీగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను వేసింది సామ్. ఈ సినిమాతో చైతు తొలి ఘన విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఎన్టీఆర్, మహేష్, నాని, నితిన్ వంటి హీరోలకు కూడా సామ్ కెరీర్ బెస్ట్ మూవీస్ ని ఇచ్చింది.
#7 కాజల్ అగర్వాల్
రామ్ చరణ్ రెండో చిత్రం మగధీర తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది కాజల్. అలాగే ఎన్టీఆర్ కి బృందావనం తో సూపర్ హిట్ ఇచ్చి క్రేజ్ సంపాదించుకుంది కాజల్.
#8 పూజా హెగ్డే
కెరీర్ స్టార్టింగ్ లో వరుస ప్లాప్ లతో సతమతమైన పూజా హెగ్డే.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో నటించిన అరవింద సమేత వీర రాఘవ, మహేష్ బాబుతో మహర్షి,అల్లు అర్జున్ తో అల వైకుంఠపురం లో, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు హిట్ కావడం తో లక్కీ చార్మ్ గా మారింది.
#9 సాయి పల్లవి
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరైంది సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో ఫిదా మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత నాని తో ఎంసీఏ మూవీ తో వరుస హిట్స్ కొట్టి లక్కీ హీరోయిన్ గా మారింది.
అలా వరుస హిట్స్ తో లక్కీ అని పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ వీళ్ళే..