సినిమా రంగుల ప్రపంచం లో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్లలో చాలా మంది పెళ్లి చేసుకున్నాక సెటిల్ అయిపోతారు. కొందరు సినిమాలపై అభిరుచి మేరకు నటనను కొనసాగించినా, మరికొందరు మాత్రం మెట్టినింటి బాధ్యతలను స్వీకరిస్తుంటారు. అలా.. మన టాలీవుడ్ లో హీరోయిన్లు గా మంచి పేరు తెచ్చుకుని ముఖ్యమంత్రుల ఇంటికి కోడళ్ళు గా వెళ్లిన హీరోయిన్ల లిస్ట్ ఓ సారి చూద్దాం.

heroins went to central ministers home

మెహరీన్ కౌర్ ఫిర్జాదా:

mehareen

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ పలు సినిమాలతో అక్కట్టుకున్నారు. ఎఫ్ 2 ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నారు. అయితే, కొన్ని రోజుల క్రితమే ఆమెకు వివాహం నిశ్చయమైంది. హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడిని ఆమె పెళ్లాడబోతోంది. భజన్ లాల్ బిష్ణోయ్ గతం లో హర్యానా ముఖ్యమంత్రి గా పని చేసారు. ఆయన కుమారుడు కుల్ దీస్ బిష్ణోయ్ ప్రస్తుతం ఆడంపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గా పని చేస్తున్నారు. కుల్ దీస్ బిష్ణోయ్ కుమారుడైన భవ్య బిష్ణోయ్ నే మెహరీన్ పెళ్లి చేసుకోబోతోంది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ లో మార్చి 12 వ తేదీన వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరగనుంది.

జెనీలియా:


సత్యం సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జెనీలియా బొమ్మరిల్లు హాసిని గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె చేసిన పలు సినిమాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసాయి. అయితే, ఆమె రితేష్ దేశముఖ్ ను పెళ్లాడారు. పెళ్లి తరువాత ఆమె సినిమాలకు దూరం గా ఉంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమా తుఝే మేరీ కసమ్ సినిమా లో రితేష్, జెనీలియా కలిసి నటించారు. ఆ సినిమా ద్వారా వారి పరిచయం ప్రేమ గా మారింది. ఆ తరువాత వీరిద్దరూ వివాహ బంధం తో ఒక్కటయ్యారు. అలా రితేష్ దేశముఖ్ ను పెళ్ళాడి జెనీలియా మాజీ ముఖ్యమంత్రి ఇంటి కోడలి గా వెళ్ళింది. రితేష్ దేశముఖ్ తండ్రి విలాస్ రావు దేశముఖ్ గతం లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా పనిచేసారు.

రాధికా కుమార స్వామి:

radhika kumara swami
కన్నడ నటి, హీరోయిన్ రాధిక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ని పెళ్లి చేసుకున్నారు. కన్నడ సినిమా పరిశ్రమకు నటి గా, నిర్మాత గా రాధిక సుపరిచితురాలు. ఆమె తన తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకోగానే సినీ ఇండస్ట్రీ లోకి వచ్చేసారు. నీల మేఘ శ్యామా సినిమా తో కన్నడ సినిమా రంగ ప్రవేశం చేసిన రాధిక ఆ తరువాత పలు కన్నడ, తమిళ సినిమాలలో నటించి మెప్పించారు.