“యానిమల్” ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హైలైట్ అయిన 5 విషయాలు ఇవే..! అలా బలవంతం చేస్తారు ఏంటి..?

“యానిమల్” ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హైలైట్ అయిన 5 విషయాలు ఇవే..! అలా బలవంతం చేస్తారు ఏంటి..?

by Mohana Priya

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాకి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

Video Advertisement

సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న తెలుగు రిలీజ్ కి సంబంధించిన ఈవెంట్ చేశారు. ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి అతిధులుగా హాజరు అయ్యారు. అంతే కాకుండా సినిమాలో నటించిన అనిల్ కపూర్, బాబీ డియోల్ కూడా ఈవెంట్ కి వచ్చారు.

highlights in animal pre release event

ఈ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించారు. దాంతో మల్లారెడ్డి కాలేజ్ అధినేత మల్లారెడ్డి గారు కూడా ఈవెంట్ కి వచ్చారు. అంతే కాకుండా దిల్ రాజు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఈవెంట్ కి హాజరు అయ్యారు. ఇంత మంది ఉన్న ఈవెంట్ లో ఇన్ని హైలైట్స్ కూడా జరిగాయి. దాంతో ఇవన్నీ సోషల్ మీడియాలో కామెంట్స్ కి మీమ్స్ మెటీరియల్ అయ్యాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

highlights in animal pre release event

#1 ప్రముఖ హీరో అనిల్ కపూర్ మహేష్ బాబుని స్టేజ్ మీదకి డాన్స్ చేయమని పిలిచారు. కానీ మహేష్ బాబు ఒక చిన్న స్టెప్ వేసి వచ్చేసారు అంతే. సాధారణంగా బాలీవుడ్ వాళ్లు తమ సినిమా ఈవెంట్స్ లో డాన్స్ చేస్తారు. తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడానికి సిగ్గుపడతారు. దాంతో ఈవెంట్ లో ఇది ఒక హైలైట్ గా నిలిచింది.

https://www.instagram.com/reel/C0J9pScpkok/?igshid=NjZiM2M3MzIxNA==

#2 సుమ, రష్మిక మందన్నతో మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు సినిమా అనబోయి సర్కారు వారి పాట అని అన్నారు. దాంతో రష్మికకి కూడా ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు అనే విషయం కొంచెం సేపు అర్థం కాలేదు అని రష్మిక ముఖం చూస్తే అర్థం అవుతోంది.

highlights in animal pre release event

#3 సాధారణంగా పెద్ద స్టార్ హీరోలు వస్తున్నారు అంటే వారు ఎలాంటి దుస్తులు వేసుకొని వస్తారు అనే దాని మీద కూడా ఆసక్తి నెలకొంటుంది. మన హీరోలు చాలా సింపుల్ గా ఉంటారు. కానీ నిన్న మహేష్ బాబు మరీ సింపుల్ గా ఒక టీ షర్ట్ వేసుకొని వెళ్ళిపోయారు. దాంతో ఇది చూసిన వాళ్ళు అందరూ, “ఇంట్లో హ్యాంగర్ కి తగిలించి ఉన్న టీషర్ట్ వేసుకొని వచ్చేసావా అన్నా?” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

highlights in animal pre release event

#4 మల్లారెడ్డి కాలేజ్ అధినేత మల్లారెడ్డి గారు ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ బిజినెస్ మాన్ సినిమా చూసి తాను రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పారు. అయితే తర్వాత సినిమా యానిమల్ గురించి ప్రస్తావిస్తూ సినిమాకి సంబంధించిన వాళ్ళందరికీ అభినందనలు తెలిపారు. అందరి పేర్లు కరెక్ట్ గానే పలికారు కానీ, హడావిడిలో రష్మిక మందన్న పేరుని రషీదా అని పలికారు.

https://www.instagram.com/reel/C0KBxhtpoRO/?igshid=NjZiM2M3MzIxNA==

#5 సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతున్నప్పుడు కొంత మంది ఫోటోగ్రాఫర్లు అక్కడ వీడియో తీస్తున్నారు. స్టేజ్ కింద ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ సందీప్ రెడ్డి వంగాని హైలైట్ చేస్తూ ఫోటో తీస్తున్నారు. ఆయన స్టేజ్ కింద ఉండడంతో సందీప్ స్టేజ్ మీద ఉండటంతో కెమెరా యాంగిల్ కాస్త హై లో పెట్టి తీయాల్సి వచ్చింది. ఇది చూసిన బాబీ డియోల్ కింద ఉన్న కెమెరాకి వంగి పోజ్ ఇస్తూ కనిపించారు. అసలు కొంచెం సేపటి వరకు బాబీ డియోల్ ఏం చేశారు అనే విషయం కూడా అక్కడ ఎవరికీ అర్థం అవ్వలేదు.

ఇవన్నీ మాత్రమే కాకుండా లైవ్ ఈవెంట్ స్ట్రీమింగ్ విషయంలో కూడా చాలా పొరపాట్లు జరిగాయి. సడన్ గా ఈవెంట్ స్ట్రీమింగ్ ఆగిపోవడం చాలా సార్లు జరిగింది. అసలు ఒక పెద్ద హీరో ఈవెంట్, అందులోనూ పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారు. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. కానీ అలాంటి ఈవెంట్ లో ఇలాంటి పొరపాట్లు జరిగాయి. ఇవి మాత్రమే కాదు. ఈవెంట్ లో ఇంకా చాలా విషయాలు మీద సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : ఫ్యామిలీతో కలిసి చూడలేనని రాజశేఖర్ కూతురు వదులుకున్న ఆ మెగా హీరో సినిమా ఏంటో తెలుసా.?


You may also like

Leave a Comment