స్పీడ్ లో దీన్ని మించింది లేదు..! “కోరమాండల్” సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చరిత్ర ఎంటో తెలుసా..?

స్పీడ్ లో దీన్ని మించింది లేదు..! “కోరమాండల్” సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చరిత్ర ఎంటో తెలుసా..?

by kavitha

Ads

ఒడిశాలో జూన్ 2న కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు గూడ్స్ రైలును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 280 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదం పీఎం, రాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల సీఎంలు మాత్రమే కాకుండా వివిధ దేశాల అధినేతలు కూడా స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు తమ  సానుభూతి తెలుపుతున్నారు.

Video Advertisement

ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రధాని మోడి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే, ఈ ప్రమాదం అనంతరం కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది గూగుల్ లో వెతుకుతున్నారు. అయితే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ చరిత్ర గురించి ఇప్పుడు చూద్దాం..
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ భారత దేశంలో తొలి సూపర్ ఫాస్ట్ ట్రైన్. రైల్వే చరిత్రలో లెజెండ్. అలాగే వేగంలో రారాజు అని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజధాని, దురంతో, శతాబ్ది, వందేభారత్ ట్రైన్స్ వచ్చాయి. అయితే 46  సంవత్సరాల క్రితం వచ్చిన మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇదే. ఇండియన్ హిస్టరీలో అత్యధిక వేగం కలిగిన  మొట్టమొదటి రైలుగా పేరుగాంచింది.
1997లో మార్చి 6న మొదలైన ఈ సూపర్ ఫాస్ట్ రైలు గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు హౌరా నుండి చెన్నై మధ్య 4 రాష్ట్రాల గుండా 25 గంటల్లో, 16 వందల 61 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రతీరోజూ దాదాపు 1661 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ చెన్నైలో మొదలయితే నాన్ స్టాప్ గా 431 కిలో మీటర్లు ప్రయాణించి 6 గంటల్లో విజయవాడ చేరుకుంటుంది.
క్షణాల్లో స్టేషన్ దాటుతుందంటే దాని వేగం అలాంటిది. 46 ఏళ్ళుగా నిరంతరాయంగా తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ వరకు ప్రయాణిస్తోంది. మొదట్లో వారానికి 2 సార్లు మాత్రమే నడిచేది. ఆ తర్వాత ఈ రైలుకు డిమాండ్ పెరగటంతో ఈ ట్రైన్ ను ప్రతిరోజూ నడుపుతున్నారు. గతంలో కూడా కోరమండల్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్ కి గురైంది.
అయితే ప్రస్తుతం జరిగిన ఈ యాక్సిడెంట్ మాత్రం చాలా పెద్దది. ఈ ట్రైన్ ను ప్రవేశపెట్టిన తరువాత ఇలాంటి భారీ ప్రమాదం జరగలేదు. ఇప్పటి దాకా లక్షలాది మందిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చిన కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు భారీ యాక్సిడెంట్ జరగటంతో దాని హిస్టరీని, స్పీడ్ ను ఆయా ప్రాంతాలవారు జ్ఞాపకం చేసుకుంటున్నారు.

Also Read: రైలు ఇంజిన్ అంత వేగంగా వెళుతూ విద్యుత్ తీగలను తాకుతూ ఉన్నా…అవి ఎందుకు తెగిపోవో తెలుసా.?

 

 


End of Article

You may also like