అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్‌లను అందుకుంటున్నారు. ఇక శైలేష్ కొలను దర్శకత్వం లో ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 .

Video Advertisement

తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ‘A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కాగా ఈ సినిమా రన్‌టైం రెండు గంటలు ఉండనుంది. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ రన్‌టైంతో ఏ సినిమా రాలేదు. థ్రిల్లర్‌ సినిమాలకు ఈ రన్‌టైం ఉంటే చాలా వరకు ప్లస్‌ అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే గతంలోనే ఈ చిత్రం చిన్న పిల్లలకి చూడడానికి లేదని స్ట్రిక్ట్ గా పెద్ద వాళ్ళకి మాత్రమే అని చెప్పారు.

adivi sesh's hit 2 sensor talk out..!!

ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠతో ఉంచుతుందని ఇన్సైడ్ టాక్. సినిమాలో విలన్ ని ఎక్సపోజ్ చేసే సీన్ చాలా అద్భుతం గా ఉందని సెన్సార్ బోర్డు సభ్యులు దర్శకుడిని అభినందించినట్లు సమాచారం. అంతే కాకుండా క్లైమాక్స్ లో అడివి శేష్ నటన సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్ళింది తెలుస్తోంది. చివరిగా హిట్ 3 గురించి దర్శకుడు క్లూ వదిలాడని టాక్.

adivi sesh's hit 2 sensor talk out..!!

ఈ చిత్రం లో అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటిస్తుంది. రావురమేష్‌, కోమలి ప్రసాద్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ తిపిరినేనితో కలిసి హీరో నాని నిర్మించాడు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయ్యింది. దాంతో సినిమా ఎలా ఉండబోతోంది అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు అవ్వాల్సిందే.