నాని నిర్మాతగా అడవి శేష్ హీరోగా నటించిన ‘హిట్-2’ మూవీ పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో అడివి శేష్‌కి జంటగా మీనాక్షి చౌదరి నటించింది. వరల్డ్‌వైడ్‌గా గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఆరు రోజుల వ్యవధిలోనే అంచనాల మించి వసూళ్లని రాబట్టింది. వరల్డ్‌ వైడ్‌గా సుమారు 990 స్క్రీన్స్‌లో ఈ సినిమాని రిలీజ్ చేశారు.

Video Advertisement

 

ఈ చిత్రం ఇప్పటికే యూఎస్ లో ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. తొలి రోజే 11.8 కోట్ల వసూళ్లని రాబట్టిన హిట్-2 మూవీ.. ఆ తర్వాత వరుసగా రూ 8.05 కోట్లు, రూ.7.15 కోట్లు, రూ.3.2 కోట్లు, రూ.2.25 కోట్లు, రూ.1.45 కోట్ల కలెక్షన్లని గొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఇప్పటి వరకూ రూ.34.2 కోట్లని కలెక్ట్ చేసినట్లు బాక్సాఫీస్ రికార్డులు చెప్తున్నాయి. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.18.01 కోట్లు‌‌గా తెలుస్తోంది. హిట్-2 మూవీని రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్లు సమాచారం. అడివి శేష్ కెరీర్‌లో ఇదే హైయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

hit 2 movie collections..

హిట్ ఫ్రాంఛైజీలో వచ్చిన రెండో సినిమా ఇది. 2020లో విశ్వక్ సేన్ హీరోగా ‘హిట్: ది ఫస్ట్ కేస్’ మూవీ వచ్చింది. ఆ సినిమా సక్సెక్ కావడంతో డైరెక్టర్ శైలేష్ కొలను అడవి శేష్ హీరోగా ఈ ‘హిట్: ది సెకండ్ కేసు’ని తెరపైకి తీసుకొచ్చాడు. ఇక వచ్చే ఏడాది ‘హిట్: ది థర్డ్ కేసు’ మూవీ కూడా రాబోతోంది. ప్పటికే ‘హిట్: ది థర్డ్ కేసు’లో అర్జున్ సర్కార్‌గా నాని ఎలా ఉండబోతున్నాడో కూడా డైరెక్టర్ శైలేష్ కొలను రెండు రోజుల క్రితం ఓ పోస్టర్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.

hit 2 movie collections..

ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. హిట్ 1 కూడా ప్రైమ్ వీడియోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది.