2022 ఫస్ట్ హాఫ్‌లో “పాజిటివ్ టాక్” తెచ్చుకున్న 12 సినిమాలు..! లిస్ట్‌లో ఉన్న సినిమాలు ఎవంటే..?

2022 ఫస్ట్ హాఫ్‌లో “పాజిటివ్ టాక్” తెచ్చుకున్న 12 సినిమాలు..! లిస్ట్‌లో ఉన్న సినిమాలు ఎవంటే..?

by Anudeep

2022 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిన్న కాక మొన్నే చేసుకున్నట్టుంది అప్పుడే అర్ధ సంవత్సరం అయిపోయింది. ఈ ఆర్నెల్లలో ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి.

Video Advertisement

కానీ కొన్ని మాత్రమే హిట్ కొట్టాయి. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలు కూడా ఈ మధ్యే విడుదల అయ్యాయి. ఈ 2022 ఫస్ట్ హాఫ్ లో హిట్ అయిన తెలుగు సినిమాలు చాలా తక్కువే అవేంటో ఒకసారి చూద్దాం . .

1. ఆర్ఆర్ఆర్ – పాన్ ఇండియా హిట్:
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రిలీజ్ అయినా తెలుగు సినిమాల్లో ఆర్ఆర్ఆర్ బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలు మరియు పాన్-ఇండియా ప్రేక్షకులు అందరు ఫుల్ గా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. బాహుబలి తర్వాత మరోసారి తెలుగు సినిమా పాన్-ఇండియా మరియు పాన్-ప్రపంచంలో స్థిరపడేలా చేసాడు డైరెక్టర్ రాజమౌళి.

2. భీమ్లా నాయక్ – సూపర్ హిట్ :

మలయాళం సినిమా అయినా అయ్యప్పనుం కోజియుమ్ కి రీమేక్ గా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాపై పవన్ ఫ్యాన్స్ చాలా హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమా సూపర్ హిట్ అయింది.

3. సర్కారు వారి పాట – హిట్ :

ఇక దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట. ట్రైలర్ చూసి అంతా పోకిరి రేంజ్ లో ఉంటుంది అని అనుకున్నారు కానీ మంచి మెసేజ్ సినిమా అయినప్పటికీ సూపర్ హిట్ కొట్టలేకపోయింది.

4.బంగార్రాజు – సంక్రాంతి హిట్ : 

సంక్రాంతి రేసులో అనేక సినిమాలు వచ్చిన ఒక్క బంగార్రాజు సినిమా మాత్రమే హిట్ అయ్యి సంక్రాంతి విజేతగా నిలిచింది.

5. ఎఫ్ 3 – యావరేజ్ :

F2 సూపర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ అంటే డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది అనుకుంటే.. యావరేజ్ కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ తో యావరేజ్ హిట్ అయ్యింది F3.

6. మేజర్ – బ్లాక్ బాస్టర్ హిట్ :

చాలా తక్కువ బడ్జెట్ లో లాభాల సినిమా చేయడం అడివి శేష్ ప్రత్యేకత. మేజర్.. 10 కోట్ల బడ్జెట్ తో చేస్తే ఈ సినిమా లాంగ్ రన్ లో 70+ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

7. డీజే టిల్లు – సూపర్ హిట్ :

సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు క్రైమ్ – కామెడీ డ్రామా చాలా తక్కువ బడ్జెట్ తో తీసారు. అంతకు ఐదింతలు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయ్యింది.

8. సమ్మతమే – హిట్ :

రాజావారు రాణిగారు, ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం సినిమాలు యావరేజ్‌ కంటెంట్‌తో హిట్ అయ్యాయి. కిరణ్ అబ్బవరం మినిమమ్ గ్యారెంటీ హీరో అనే మార్కెట్ వచ్చేసింది. సమ్మతమే హిట్ తో అది మరోసారి ప్రూవ్ అయింది.

తెలుగులో డబ్ అయ్యి హిట్ అయిన సినిమాలు:

ఇతర భాష నుంచి తెలుగులో డబ్ అయిన నాన్-తెలుగు సినిమాలు చూస్తే..

1. విక్రమ్ – బ్లాక్ బాస్టర్ హిట్ :

చాలాకాలం తర్వాత కమల్ హాసన్ కి విక్రమ్ సినిమా ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్ పడింది. కమల్ లాంటి పొటెన్షియల్ యాక్టర్ కమర్షియల్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో విక్రమ్ మూవీ కంటెంట్ మరియు కలెక్షన్స్ తో ప్రూవ్ అయ్యింది.

2. కేజీఎఫ్ 2 – బ్లాక్ బాస్టర్ హిట్ :

యష్ & నీల్ మావ ఎలివేషన్స్ కి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కి అడ్డు అదుపు లేకుండా పోయింది. కన్నడ, తెలుగు, తమిళంలో బ్లాక్ బాస్టర్ అయితే హిందీలో డబుల్ బ్లాక్ బాస్టర్ అయింది కేజీఎఫ్ 2.

3. డాన్ – హిట్ :

శివ కార్తికేయన్ డాక్టర్ తెలుగులో హిట్ అయ్యింది. అలాగే మొన్న వచ్చిన డాన్ కి కూడా తెలుగు వెర్షన్ బానే కలెక్ట్ చేసింది. డాన్ అటు తమిళం ఇటు తెలుగులో కూడా హిట్ కొట్టింది.

4. వలీమై – యావరేజ్:

ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన అజిత్ వలీమై సినిమా తెలుగులో యావరేజ్ కలెక్షన్స్ వసూలు చేసింది.


You may also like

Leave a Comment