ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మన ఆరోగ్యం మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. కరోనా నుండి కానీ లేదా ఇతర ఏ అనారోగ్య సమస్యల నుండి కానీ మనల్ని మనం కాపాడుకోవడానికి కావలసినది ఇమ్మ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీ కోసం మనం ఈ కింద చెప్పినవి ఇంట్లోనే తయారుచేసుకుని తరచుగా తీసుకుంటూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

#1 మసాలా టీ

ఇంట్లో దొరికే మసాలా సామాగ్రితో ఈ టీ తయారు చేస్తారు. ఇందులో వాడే అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు పదార్థాలలో ఇన్ఫెక్షన్లు నివారించే శక్తి ఉంటుంది.

homemade drinks for immunity

#2 తేనే, నిమ్మరసం

తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి. అలాగే శ్వాస సంబంధిత సమస్యల నుండి కూడా ఇది కాపాడుతుంది.

homemade drinks for immunity

#3 పసుపు టీ

పసుపులో ఉండే గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే ప్రోటీన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొంచెం నీటిలో పసుపు కలిపి అందులో రుచి కోసం నిమ్మకాయ కాని తేనె కాని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

homemade drinks for immunity

#4 గ్రీన్ స్మూతీ

కొంచెం బచ్చలికూర తీసుకొని అందులో పైనాపిల్ లేదా మామిడి ముక్కలు, నిమ్మరసం, అల్లం, పాలు లేదా పెరుగు తీసుకొని ఆ పదార్థాల మొత్తాన్ని ఒక మిశ్రమం లాగా చేసుకుని, ఈ మిశ్రమాన్ని వడపోసుకొని తాగాలి. ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ తదితర యాంటీ ఆక్సిడెంట్లు కడుపులో మంట వంటి సమస్యలను, అలాగే శరీరంలో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

homemade drinks for immunity