అభిమన్యుడు చిక్కుకున్న “పద్మవ్యూహం”….ఎలా ప్లాన్ చేశారో తెలుసా? ఎందుకు అది కష్టమైనది?

అభిమన్యుడు చిక్కుకున్న “పద్మవ్యూహం”….ఎలా ప్లాన్ చేశారో తెలుసా? ఎందుకు అది కష్టమైనది?

by Mohana Priya

Ads

మహాభారతంలో కురుక్షేత్రం తర్వాత అంత ముఖ్యమైనది పద్మవ్యూహం. పద్మవ్యూహంలో అర్జునుడు ఎన్నో వలయాలను దాటి వెళ్లి విరోచితంగా యుద్ధం చేశాడు. అసలు పద్మవ్యూహం అంటే ఏమిటి? ఎందుకు అందరూ అది ఎంతో కష్టమైనది అని చెప్తారు? పద్మవ్యూహం లో ఏముంటుంది? అభిమన్యుడు అందులోకి ఎలా ప్రవేశించాడు? అన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

#1 ఎదుటి వారి సైన్యం ఎంతో బలంగా ఉన్నప్పుడు వాళ్లని యుద్ధంలో ఓడించడం కష్టం అనుకున్నప్పుడు అవతల రాజ్యం వాళ్ళు వేసే ప్రణాళికను వ్యూహం అంటారు. వ్యూహాల్లో ఎక్కువ కండ బలం కంటే బుద్ధిబలం ముఖ్యం. కురుక్షేత్రం లో ఉన్న వ్యూహాలు ఇవి.

క్రౌంచ వ్యూహం (కొంగలు)

మకర వ్యూహం (మొసళ్ళు)

కూర్మ వ్యూహం (తాబేళ్లు)

త్రిశూల వ్యూహం (త్రిశూలాలు)

చక్రవ్యూహం (చక్రాలు)

పద్మవ్యూహం (పద్మాలు)

గరుడ వ్యూహం (గద్దలు)

ఊర్మి వ్యూహం (సముద్రాలు)

మండల వ్యూహం (పాలపుంతలు)

వజ్ర వ్యూహం (వజ్రాలు, పిడుగులు)

శకట వ్యూహం (శకటాలు)

అసుర వ్యూహం (రాక్షసులు)

దేవ వ్యూహం (భక్తి, దైవాంశ సంభూతులు)

సూచి వ్యూహం (సూదులు)

శృంగాటక వ్యూహం (ముళ్ళు)

చంద్రకళ వ్యూహం (నెలవంక ఆకారంలో ఉన్న కత్తులు)

మాల వ్యూహం (దండలు)

#2 కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు సాగింది. అందులో ఎంతో కష్టమైనది పద్మవ్యూహం. కానీ అభిమన్యుడికి ఆ పద్మవ్యూహంలోకి వెళ్లే దారి ముందే తెలుసు. ఒక రోజు అర్జునుడు సుభద్రకి పద్మవ్యూహం చాలా కష్టమైనది అని అందులోకి ఎలా వెళ్లాలో చెబుతూ ఉంటాడు. మధ్యలో సుభద్ర నిద్ర లోకి జారుకుంటుంది.

#3 దాంతో సుభద్ర పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలి అంత వరకే వింటుంది. ఆమెతో పాటు తన కడుపులో ఉన్న అభిమన్యుడు కూడా అర్జునుడు చెప్పేదంతా వింటాడు. సుభద్ర నిద్రలోకి జారుకున్న విషయం చూసి అర్జునుడు చెప్పడం ఆపేస్తాడు. అలా అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి ముందే తెలుస్తుంది.

#4 కురుక్షేత్ర యుద్ధ సమయంలో ద్రోణాచార్యుడి పథకం ఫలించనందుకు దుర్యోధనుడు కోపంతో ద్రోణాచార్యుడిని అవమానించాడు. దానికి ద్రోణాచార్యుడు ఈసారి రచించిన వ్యూహం తో పాండవులను కచ్చితంగా అంతం చేయవచ్చు అని దుర్యోధనుడికి మాటిచ్చాడు.కానీ ఒకవేళ అర్జునుడు ఉంటే ఇదంతా సాధ్యం కాదు కాబట్టి అర్జునుడి దృష్టి మళ్లించమని దుర్యోధనుడికి చెప్పాడు.

#5 దుర్యోధనుడు తన సైన్యం లోని కొంతమంది సైనికులను పాండవుల దగ్గరికి పంపించి అర్జునుడిని రెచ్చగొట్టే లాగా మాట్లాడించాడు. వాళ్లు అనే మాటలకి కోపం వచ్చిన ధర్మరాజు అర్జునుడిని వారితో యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. అన్నమాట జవదాటని అర్జునుడు సరే అని యుద్ధానికి బయలుదేరాడు.

#6 కృష్ణుడు రథం నడుపుతున్నాడు. ఆ రథంలో అర్జునుడు కౌరవ సైనికులను వెంటాడుతున్నాడు. కౌరవ సైనికులు చాలా దూరం వెళ్లి పోయి ఆగి వెనక్కి తిరిగి అర్జునుడి వైపు రావడం మొదలుపెట్టారు.వారితో ఇంకా గుర్రాలమీద వేరే సైనికులు కూడా వచ్చి కలిశారు. వారందరూ వారి వైపు వస్తుండడంతో కృష్ణుడికి ఇదంతా వాళ్ల వ్యూహం అని అర్థమైంది. అర్జునుడికి అదే మాట చెప్పాడు కానీ అర్జునుడు మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు అని చెప్పాడు.

#7 వారందరూ అర్జునుడు కృష్ణుడు ఉన్న రథాన్ని అర్థ చంద్రాకారంలో చుట్టుముట్టారు తర్వాత మెల్లగా 30 వేల సైనికులు అర్జునుడు కృష్ణుడు ఉన్న రథం చుట్టూ నిల్చున్నారు. దాంతో ఇదంతా వ్యూహం అని కృష్ణార్జునులకు అర్థం అయింది.  అర్జునుడు కృష్ణుడితో బహుశా తన జీవితంలో ఇదే చివరి రోజు అవుతుందేమో అని, కానీ ఒకవేళ అదే నిజమైతే తన చివరి శ్వాస వదిలే లోపు ఈ 30000 సైనికుల్లో ఒక్క సైనికుడు  కూడా బతకడు  అని చెప్పాడు.

#8 ద్రోణాచార్యుడు చెప్పినట్టే అర్జునుడు పాండవుల కు దూరంగా ఉన్నాడు అని కౌరవులకు వర్తమానం అందింది. ద్రోణాచార్యుడు శంఖారావం పూరించాడు. అప్పుడు కౌరవ సైనికులందరూ యుద్ధ మధ్యలోనే ఆపేసి వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టారు. ద్రోణాచార్యుడు మళ్లీ శంఖం పూరించాడు. అప్పుడు కౌరవ సైనికులందరూ పాండవుల చుట్టూ చక్రం లాగా ఏర్పడ్డారు.

#9 ఆ చక్రం ఏడు వలయాలుగా ఉంటుంది. ఒక వలయంలో రథం మీద ఉన్న సైనికులు, ఇంకొక వలయంలో ఏనుగుల మీద ఉన్న సైనికులు, మరొక వలయంలో గుర్రాల మీద తిరుగుతున్న సైనికులు, తర్వాత బాణాలు వేసే సైనికులు, మొట్టమొదట ఉండే వలయంలో కత్తులతో తిరుగుతున్న సైనికులు ఉంటారు. ఒక్కో వలయం లో ఐదు వరుసల్లో సైనికులు ఉంటారు.

#10 ఒక్కొక్క వలయానికి సైనికుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. చివరి వలయంలో రాజులు, యోధులు, ఎంతో పెద్ద వీరులు, బలశాలులు,శకుని, కృపాచార్య ఉంటారు. ఈ ఏడు వలయాలోనూ ఉండే సైనికులు సూర్యుడు భూమి చుట్టూ ఎలా తిరుగుతాడో అదేవిధంగా వాళ్లు కూడా పాండవుల చుట్టూ తిరుగుతారు. కాబట్టి ఒకవేళ మొదటి  వలయం చేధించి లోపలికి వెళ్తే  తిరుగుతూ ఉండటం వల్ల ఆ మొదటి వరుసలో ఉండే సైనికులందరూ చనిపోరు.

#11 వలయం తిరుగుతున్నప్పుడు పాండవులు వచ్చే సమయానికి వారి ఎదురుకుండా ఎవరు ఉంటారో వాళ్ళని మాత్రమే చంపి తర్వాతి వలయానికి వెళ్తారు. లోపలికి వెళ్లగానే మొదటి వలయంలో తిరుగుతున్న వేరే సైనికులు వీరిని చుట్టుముట్టి వెనకనుండి చంపేస్తారు.

#12 ఇదే పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహం చేధించడం పాండవుల్లో ఎవరికీ తెలీదు ఒక్క అభిమన్యుడికి తప్ప. దాంతో అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చేధించడానికి బయలుదేరాడు. అభిమన్యుడు తనకి లోపలికి వెళ్లడానికి మాత్రమే దారి తెలుసు అని బయటికి రావడానికి దారి తెలియదు అని ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అభిమన్యుడు తో లోపలికి వెళ్ళమని అభిమన్యుడి వెనకాలే తాము కూడా వస్తామని దాంతో అభిమన్యుడు దారి చూపిస్తూ ఉంటే పాండవులు ఆ దారిలో వచ్చి కౌరవ  సైన్యాన్ని అంతం చేస్తామని చెప్తాడు.

#13 అభిమన్యుడు తన రథం మీద ఎక్కి మొదటి వలయంలో ఐదు వరుసలుగా తిరుగుతున్న సైనికుల వేగాన్ని గమనించి గాల్లోకి బాణాలు విసిరాడు. మొదటి బాణం మొదటి వరుసలో ఉన్న సైనికులకి తగిలింది. అలా ఐదు సార్లు 5 వరుసల్లో ఉన్న సైనికుల కి తగిలేలా బాణాలు విసిరాడు. దాంతో మొదటి వలయం లో ఉన్న ఐదు వరుసల్లో ఒక భాగంలో ఉన్న సైనికులు అందరూ చనిపోయారు. అప్పుడు ఆ స్థలం పద్మవ్యూహం లోని మొదటి వలయాన్ని దాటడానికి  అభిమన్యుడికి దారి లాగా ఏర్పడింది. అలా మొదటి వలయాన్ని చేధించాడు.

#14 ఒకసారి దుశ్శల భర్త అయిన సైంధవుడు ద్రౌపది జోలికి వచ్చాడు. ద్రౌపదితో అలా తప్పుగా ప్రవర్తించినందుకు పాండవులు సైంధవుడి కి అర గుండు కొట్టి అవమానించారు. దాంతో కోపం తెచ్చుకున్న సైంధవుడు ఒంటికాలి మీద తపస్సు చేశాడు. తన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు సైంధవుడు పాండవులందరిని అంతం చేయాలి అని వరం కోరాడు.

#15 కానీ అప్పటికే అర్జునుడికి  శివుడు పాశుపతాస్త్రం ఇచ్చాడు. అందుకే ఒక్క రోజు మిగిలిన పాండవులు అందరిని ముందుకు కదలకుండా అడ్డుకునే వరాన్ని ఇచ్చాడు.అలా శివుడు ఇచ్చిన వరాన్ని సైంధవుడు పద్మవ్యూహం సమయంలో ఉపయోగించాడు. దాంతో పాండవులు అభిమన్యుడి తో వెళ్లలేకపోయారు. అయినా సరే అభిమన్యుడు మళ్లీ వెనక్కి వెళ్లకుండా తన యుద్ధాన్ని కొనసాగించాడు.

#16 ఇదంతా చూస్తున్న కర్ణుడు అభిమన్యుడి మీద బాణం వేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అభిమన్యుడు తెలివిగా కర్ణుడు తో పోరాటం చేస్తుంటే మిగిలిన సైనికుల ని చంపి ముందుకు వెళ్లడం కుదరదు అని కర్ణుడు విల్లు ఎక్కు పెట్టిన ప్రతిసారి అభిమన్యుడు తన వీపు చూపిస్తాడు.

#17 ఏ వైపు నుండి కర్ణుడు బాణం వేయాలని ప్రయత్నించినా కూడా అభిమన్యుడు ఆ వైపు తన వీపుని చూపిస్తాడు. వెనక నుండి బాణం వేయడం అధర్మం అని కర్ణుడు బాణం వేయలేక అలానే ఆలోచిస్తూ ఉంటే దుర్యోధనుడు వచ్చి ఇప్పుడు ధర్మం  అధర్మం గురించి ఆలోచించాల్సిన సమయం కాదు అని చెప్పి కర్ణుని బాణం వేయమన్నాడు దాంతో చేసేదేమీ లేక కర్ణుడు అభిమన్యుడిపై వెనకనుండి బాణం విసురుతాడు.

#18 అప్పటికి అభిమన్యుడు 5 వలయాలు దాటి ఆరవ వలయం దగ్గర ఉంటాడు. కర్ణుడు వెనకనుండి విసిరిన బాణం అభిమన్యుడికి తగులుతుంది. తన గాయాన్ని పట్టించుకోకుండా తనకు తగిలిన విల్లుని తీసేసి అభిమన్యుడు యుద్ధం కొనసాగిస్తుంటాడు. కృపాచార్యుడు అభిమన్యుడు రథసారధి అయిన సౌమిత్రి పై బాణం వేస్తాడు. దాంతో సౌమిత్రి మరణిస్తాడు. ఒక చేతితో రథం నడుపుతూ మరో చేత్తో బాణాలు వేస్తుంటాడు అభిమన్యుడు.

#19 మళ్లీ ఒక నాలుగు బాణాలు వచ్చి అభిమన్యుడి గుర్రాలకి తగులుతాయి. దాంతో గుర్రాలు పడిపోతాయి. చాలా వేగంగా వెళ్తున్న గుర్రాలు పడిపోవడంతో రథం ఒక్కసారిగా ఎగిరి కింద పడింది. అభిమన్యుడు కూడా అంతకంటే ఎత్తుకు ఎగిరి కింద పడ్డాడు. అయినా సరే అభిమన్యుడు లేచి తన విరిగిపోయిన రథం దగ్గరికి వెళ్లి ఒక బుట్టలో నుండి బాణాలు తీసి విసరడం మొదలుపెడతాడు. ద్రోణాచార్యుడు వేసిన బాణం వచ్చి అభిమన్యుడి ధనస్సు కి మధ్య భాగంలో తగులుతుంది. దాంతో ధనస్సు రెండు ముక్కలవుతుంది.

#20 అప్పుడు అభిమన్యుడు తన విరిగిన రథం పైకి ఎక్కి ఎగిరి తన అమ్ములపొది కి దగ్గరగా ఉన్న కత్తులని రెండు చేతులతో చెరొకటి పట్టుకొని తలలు నరకడం మొదలు పెట్టాడు. అప్పుడు ద్రోణుడు ఒక బల్లెంతో అభిమన్యుడి ఒక కత్తిని విరిచేస్తాడు. కర్ణుడు ఒక బాణంతో మరొక కత్తిని విరిచేస్తాడు. అభిమన్యుడు తన విరిగిపోయిన రథం దగ్గరికి వెళ్లి చూస్తాడు ఒక చక్రం విరిగిపోయి ఉంటుంది మరొక చక్రం మామూలుగా ఉంటుంది. ఆ మామూలుగా ఉన్న చక్రాన్ని తన రెండు చేతులతో ఎత్తి ఎదురు వచ్చిన వాళ్ళని ఆ చక్రం తోనే కొడతాడు.

#21 అలా బాణాలు కత్తులు లేకపోయినా రథచక్రం తో యుద్ధం చేస్తూ ఉంటాడు అభిమన్యుడు. సాయంత్రం అయిపోతుంది. అభిమన్యుడు ఓపిక మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది అయినా సరే అభిమన్యుడు వెనకడుగు వేయకుండా యుద్ధం చేస్తూ ఉంటాడు. అప్పటివరకు అభిమన్యుడి తో యుద్ధం చేస్తున్న సైనికులందరూ ఆగిపోయి వెనక్కి వెళ్లిపోతారు.

 

#22 ఎనిమిది రథాలు అభిమన్యుడి చుట్టుముట్టాయి. అందులో ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వద్ధామ, బృహద్బల, శకుని, దుర్యోధనుడు ఉంటారు. వారి దగ్గర ఉన్న ఆయుధాలతో అభిమన్యుడి రథ చక్రాన్ని విరగ్గొట్టారు. దుర్యోధనుడి కొడుకు గద తో అభిమన్యుడి తలపై కొట్టాడు. కర్ణుడు వెనక నుండి అభిమన్యుడిపై కత్తితో దాడి చేశాడు.అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అభిమన్యుడిపై తమ కత్తులతో దాడి చేస్తారు. దాంతో అభిమన్యుడు వీర మరణం పొందుతాడు.

ఇది కురుక్షేత్రంలోని ఎంతో ముఖ్యమైన పద్మవ్యూహం యొక్క కథ.

 

 

 


End of Article

You may also like