ఖాళీ గిన్నె నుండి బాబాలు నీళ్ళని ఎలా తీసుకొస్తారో తెలుసా..? నిజంగా అలా జరుగుతుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే..!

ఖాళీ గిన్నె నుండి బాబాలు నీళ్ళని ఎలా తీసుకొస్తారో తెలుసా..? నిజంగా అలా జరుగుతుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే..!

by Megha Varna

Ads

చాలా సార్లు బాబాలు ఖాళీ గిన్నెలో నుంచి నీళ్లు తీస్తూ వుంటారు. ఇలా నీళ్లు తీయడం మనం చూసే ఉంటాం. అయితే మనకి అనుమానం కలుగుతుంది. అసలు ఎలా నీళ్లు బయటకు వస్తాయి..? మొదట ఖాళీ గిన్నెని చూపించారు కదా నీళ్లెలా వచ్చాయి అని అనుకుంటాము. ఆఖరికి నీళ్లు తీసే సరికి మనం నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది అని. లేదంటే వాళ్ళు నిజమైన బాబ అని నమ్మేస్తూ ఉంటాం. కానీ నిజానికి ఇలా ఖాళీ గిన్నె లో నుంచి నీళ్లు బయటకు తీయడానికి ఒక ట్రిక్ ఉంది. మరి ఆ ట్రిక్ ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

సాధారణంగా మొదట బాబాలు మొదట ఖాళీ గిన్నెని చూపిస్తారు. ఆ తర్వాత మాయ చేస్తున్నట్లుగా అటు ఇటు చేతులని కదుపుతారు. ఆ తర్వాత ఖాళీ గిన్నెని వంచి దానిలో నుంచి నీళ్లు చూపిస్తారు. అయితే మొదట చూసిన ఖాళీ గిన్నె నుంచి నీళ్లు ఎలా వచ్చాయి..? ఇందులో ఏమి పెద్ద కిటుకు లేదు.

కేవలం చిన్న ప్రాంక్ లాగ చేస్తారు. అది ఏంటంటే మొదట ఖాళీ గిన్నెని చూపించినప్పుడు అందులో బెలూన్ ఉంటుంది. ఆ బెలూన్ కింద పడిపోకుండా ఖాళీ గిన్నెని చూపించినప్పుడు వేళ్ళని అడ్డం పెట్టుకుని ఉంచుతారు. ఇది వాటర్ తో ఫిల్ చేసిన బెలూన్. అయితే వేళ్ళని అడ్డం పెడతారు కనుక కింద పడదు.

తర్వాత ఒక చిన్న పిన్ ని తీసుకుని బెలూన్ ని పేల్చేస్తారు. ఇలా గిన్నె లోపల ఇంత జరుగుతూ ఉంటుంది. బెలూన్ పేలిపోవడం తో బెలూన్ లోపల నీళ్లు గిన్నె లోకి వస్తాయి. ఇదిగో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయని ఒక దానిలోకి వంచుతారు. బెలూన్ పేలడం వలన నీళ్లు పడతాయి. కానీ ఆ బాబాలు ఏమి మాయ చేసి నీళ్లు తీసుకురారు. అయితే వాళ్ళే నిజమైన బాబాలు అని అనుకోవద్దు. ఎవ్వరు కూడా నీళ్ళని సృష్టించలేరు.


End of Article

You may also like