Ads
లాక్ డౌన్ కారణంగా చాలామంది జనాలకి ఇళ్లలో ఉండి ఉండి విసుగు వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చేందుకు చైనా వాళ్ళ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది ఖాళీ సమయం ఎక్కువయ్యి అతిగా ఆలోచించడం మొదలుపెట్టారు. వీళ్లు కరోనా కి కారణమైన చైనా వాళ్లని తిట్టడమే కాకుండా, అసలు గబ్బిలం తినడం ఏంటి? గబ్బిలం ఎందుకు తినాలి అనిపించింది? అని ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నారు. మనకి తెలుసు తెలియకుండానో కరోనా తో పాటు గబ్బిలం అంటే కూడా చిన్న భయం మొదలైంది. పులి సింహం లాంటి మృగాలకు ఎలా భయపడతారో గబ్బిలం అన్నా కూడా అంతలా భయం ఏర్పడింది.
Video Advertisement
కానీ మీకు ఒక విషయం తెలుసా. గబ్బిలాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
- చాక్లెట్ అంటే ఇష్టం లేని మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఒకవేళ గబ్బిలం పూర్తిగా తరిమికొట్టాలి అనుకుంటే అది చాక్లెట్ ప్రియులకు మాత్రం చేదు వార్తే. చాక్లెట్ వచ్చేది గబ్బిలాలు వల్ల. అవును. గబ్బిలాల జామ,కొకొవా లాంటి చెట్లపై వాలతాయి. పోలినేషన్ పద్ధతిలో గబ్బిలాలు కొకొవా బీన్స్ రావడానికి సహకరిస్తాయి. కాబట్టి గబ్బిలాలు లేకపోవడం తో చాక్లెట్లు దొరకవు అనే విషయం కొకోవా కంటే చేదుగా ఉంటుంది.
- ఇంట్లో అంటే దోమలు పోవడానికి ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. కానీ పంటల్లో దోమలు ఎలా పోతాయో మీకు తెలుసా? దానికి కూడా గబ్బిలాలే కారణం. గబ్బిలాలు రాత్రిపూట దోమల ని తినేసి జికా వైరస్ వ్యాపించకుండా ఆపుతాయి.
- గబ్బిలాలు లేకపోతే వ్యవసాయం నిలబడటం కష్టం అన్నదానికి నిదర్శనం అమెరికాలో జరిగిన ఒక సంఘటన. అమెరికా లో పెస్ట్ కంట్రోల్ లో ఎన్నో గబ్బిలాలు చనిపోయాయి. దాని తర్వాత అమెరికా వ్యవసాయంలో ఎన్నో బిలియన్ డాలర్లు నష్టపోయింది. దీంతో గబ్బిలాలు లేకపోవడం వల్ల భారీ నష్టం వచ్చింది అని అంటారు.
- గబ్బిలాలు ఎన్నో పండ్లను తింటాయి. కానీ ఒక్కొక్కసారి వాటిలో ఉన్న గింజలు అరగకపోవడం వల్ల అవి ఎక్స్క్రియేటా రూపంలో బయటకు వచ్చేస్తాయి. గబ్బిలాలు ఒక చోట ఉండకుండా ఎన్నో చోట్లకు ప్రయాణిస్తాయి కాబట్టి ఆ గింజలు అక్కడక్కడ పడి ఎన్నో చెట్లు మొలుస్తాయి కాబట్టి అడవి సంపద పెరగడానికి పరోక్షంగా గబ్బిలాలు కూడా ఒక కారణమే.
- అంతరించిపోయే జీవుల లో గబ్బిలాలు కూడా ఒకటి. ఒకవేళ మనం గబ్బిలాలను పూర్తిగా నిర్మూలిస్తే 20 శాతం క్షీరదాలు ఉండవు. ఉన్న ఐదు క్షీరదాల్లో ఒక క్షీరదం లేకుండా పోవడం తో ప్రకృతిలో సమతుల్యత ఉండదు. అందువల్ల రాబోయే రోజుల్లో జీవరాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కొంతకాలం ఓపిక పడితే ఈ కరోనా నుండి బయటపడవచ్చు. కానీ క్షణికావేశంలో గబ్బిలాలను అంతం చేయాలి అనుకుంటే మాత్రం మనం భవిష్యత్తుని చాలా విషయాలు లేకుండా ఉంచుకోవాల్సి వస్తుంది.ఇప్పుడు మీరే ఆలోచించండి. ఒక్క కరోనా గురించి ఆలోచించి గబ్బిలాలను అంతం చేయడం సరైనదా లేదా ఎన్నో ఉపయోగాలు ఉన్న గబ్బిలాలను ఈ భూమ్మీద బ్రతకనియ్యడం, ఇంకా వాటిని అంతరించి పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం సరైనదా ?
End of Article