కరోనా వైరస్ థాటికి ప్రపంచదేశాలన్ని వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 161 దేశాల్లో కరోనా వైరస్ ప్రభలి తొమ్మిదివేల మంది వరకు ప్రాణనష్టం సంభవించింది. ఇంకా రెండు లక్షల పాతిక వేలమందికి పైగా కరోనా బారిన పడిన వారున్నారు. వాళ్లల్లో పదివేలమంది కండిషన్ చాలా సీరియస్ గాఉంది . మొత్తం దేశాలకు దేశాలే తమని తాము కట్టడి చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మొట్టమొదటగా వైరస్ దాడికి గురైన చైనా మాత్రం ఇప్పుడు పూర్తిగా కోలుకుంది.

చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కరోనా కేసు నమోదైంది అనే విషయం అందరికి తెలిసిందే. వూహన్ నగరం మొత్తం వైరస్ దాడికి గురై అస్తవ్యస్తం అయింది. వైరస్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరగడంతో వెయ్యి పడకల హాస్పటల్ ని నిర్మించడమే కాదు, ఎక్కడిక్కడ హోటల్లలాంటి పెద్ద పెద్ద భవనాల్ని హాస్పటిల్స్ గా మార్చేసింది చైనా ప్రభుత్వం.

సుమారు నాలుగు నెలల క్రితం అనగా గతేడాది డిసెంబరు నుండి ఊహాన్ లో ఎక్కడిక్కడ నగరం మొత్తం స్తంబించిపోయింది . ఎక్కడిక్కడ  అపార్ట్మెంట్స్, ఇల్లు వాళ్లకి వాళ్లే ఐసోలేషన్లోకి వెళ్లిపోయిన పరిస్థితి. మొత్తం  వూహాన్ నగరం మొత్తం తనని తాను క్వారెంటైన్లోకి మార్చేసుకుంది. అలాంటి పరిస్తితి నుండి చైనా కోలుకుంది. కొత్తగా నిర్మించిన హాస్పిటల్ నుండి చివరి పేషెంట్ కి క్యూర్ చేసి పంపించేసి, ఊపిరి పీల్చుకుంది.ఇప్పుడు చైనాలో కరోనా కేసుల నమోదు శాతం పూర్తిగా తగ్గిపోయింది. కొత్తగా నమోదైన 34 కేసులు విదేశీయులవే.

చైనా కట్టడి చేసిన విధానం చూసి మిగిలిన దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. అదే పద్దతిని ఫాలో అయితే మన దేశం కూడా సేఫ్ అని భావిస్తున్నాయి. కోటి పదిలక్షలున్న జనాభాని క్వారంటైన్‌ చేయడమంటే మాటలు కాదు. వుహాన్ వాసులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. హాస్పిటల్ సిబ్బందిని పెంచారు. వాళ్ళ కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

ఫ్యాక్టరీ లు మూసేసారు. రవాణా సంస్థ నిలిపేశారు. ఇప్పుడదే మార్గాన్ని షట్ డౌన్‌ అని..లాక్ డౌన్ అని ఇతర దేశాలు కూడా ఫాలో అవుతున్నాయి. మనం పాటించే జనతా కర్ఫ్యూ కూడా ఇందులోని భాగం లాంటిదే. ప్రభుత్వానికి మనం సహకరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చైనా లాగే మనం కూడా కరొనను కట్టడి చేయచ్చు.

If you want to contribute content on our website, click here

Cryptoknowmics Sharing is Caring:
No more articles