సాధార‌ణంగా సినిమా అంటేనే రిచ్‌గా తీయాలి. అన్నింటిలోనూ ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు చాలా రిచ్‌గా ఉండాలి. లేదంటే క్వాలిటీ అవుట్ పుట్ రాదు. అంతే కాకుండా సినిమాలో ప్రతి విషయాన్నీ ఎంతో జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించాలి. లేదంటే చిన్న త‌ప్పు దొర్లినా చాలు.. ప్రేక్ష‌కులు ట్రోల్ చేస్తారు. ఇదివరకు ట్రోలింగ్స్ అవి ఉండేవి కావు కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఉన్న అంతగా పట్టించు కొనేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది.

Video Advertisement

సాధార‌ణంగా సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు లేదా ఇత‌ర న‌టీన‌టులు ధ‌రించే దుస్తులు బ్రాండెడ్‌వే అయి ఉంటాయి. వాటి విలువ లక్షల్లో కూడా ఉంటుంది కొన్ని సార్లు. ఎక్కువగా వాటిని రెంట్‌కు తీసుకువ‌స్తుంటారు. లేదా కొన్ని సార్లు న‌టీన‌టులే త‌మ సొంత దుస్తుల‌ను ధ‌రించి షూటింగ్‌లో పాల్గొంటారు.

how to make clothes dirty in movies..
అయితే కథను అనుసరించి కొన్ని సార్లు నటీనటులు డీ గ్లామ‌ర్ లేదా పూర్ లుక్ లో కనిపించాల్సి ఉంటుంది. అలాంటపుడు బ్రాండెడ్ దుస్తులు ధరిస్తే పాత్ర పండదు. దాని కోసం కచ్చితంగా మురికిగా ఉండే దుస్తుల‌నే ధ‌రించాలి. మ‌ర‌లాంట‌ప్పుడు దుస్తుల‌కు మురికి పూస్తారా.. మురికిలో ముంచాక దుస్తుల‌ను న‌టీన‌టులు వేసుకుంటారా.. అంటే.. లేదు..అలా కనిపించేందుకు మురికి దుస్తులే వేసుకోవాల్సిన అవసరం లేదు.

how to make clothes dirty in movies..

ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు దుస్తులు మురికిగా క‌నిపించేందుకు ద‌ర్శ‌కులు ఒక టెక్నిక్ వాడ‌తారు. అది ఏదంటే.. దుస్తులు అలా మురికిగా క‌నిపించేందుకు వారి దుస్తుల‌ను టీ లేదా కాఫీల‌లో ముంచి తీస్తారు. త‌రువాత రెండు మూడు సార్లు ఉతికి ఆరేస్తారు. అనంత‌రం వాటిని ధ‌రిస్తారు. దీంతో దుస్తులు మురికిగా క‌నిపిస్తాయి. క్యారెక్ట‌ర్‌కు త‌గిన‌ట్లు ఉంటాయి. పాత్రకు తగ్గ కాస్ట్యూమ్స్ రెడీగా ఉంటాయి.

 

how to make clothes dirty in movies..
రంగ‌స్థ‌లం, పుష్ప సినిమాల్లో న‌టీన‌టులు అంద‌రూ డీ గ్లామ‌ర్ లుక్‌లో క‌నిపించారు. అంద‌రి దుస్తులు మురికిగానే ఉంటాయి. అయితే ఈ విష‌యాన్ని రామ్ చరణ్ గ‌తంలో ఒక‌సారి ఇంటర్వ్యూ లో చెప్పారు. అందువ‌ల్లే అంద‌రికీ ఈ విష‌యం తెలిసింది.

how to make clothes dirty in movies..

పెర్ఫెక్షనిస్ట్ సుకుమార్ పాత్రల పర్ఫెక్షన్ కోసం ఇంత శ్రద్ధ తీసుకుంటారు కాబట్టే ఆయన సినిమాలు సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి.