సినిమాల్లో “ఫేక్ కరెన్సీ” ఎలా వాడతారో తెలుసా..? చట్టపరమైన చర్యలు ఏమి ఉండవా..?

సినిమాల్లో “ఫేక్ కరెన్సీ” ఎలా వాడతారో తెలుసా..? చట్టపరమైన చర్యలు ఏమి ఉండవా..?

by Megha Varna

Ads

డబ్బులు అనేది ప్రతీ ఒక్కరికి కూడా చాలా అవసరం. డబ్బులు లేకపోతే ఏది ఉండదు. అయితే నోట్ల విషయంలో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి నకిలీ నోట్లు కూడా వస్తూ ఉంటాయి. ఇటువంటి నకిలీ నోట్ల తో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Video Advertisement

ఇదిలా ఉంటే సినిమాల్లో నకిలీ నోట్లను చూపిస్తూ వుంటారు. అయితే మరి అలా తయారు చేసేయచ్చా..? ఎలాంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోరా అనేది చూద్దాం.

సినిమాలో చూస్తే వేలకు వేలు కోట్లకి కోట్లు నకిలీ నోట్లు కనబడుతూనే ఉంటాయి అవి చూడడానికి నిజం నోట్ల లానే కనబడుతూ ఉంటాయి. కానీ అవి నకిలీ నోట్లు అని అందరికీ తెలుసు. అయితే మరి సినిమాల్లో ఉపయోగించే నకిలీ నోట్లు ఎక్కడి నుండి వస్తాయి..? సినీ ఇండస్ట్రీ వాళ్ళు నకిలీ నోట్లు తయారు చేసుకోవచ్చా..? వాళ్ల పైన పోలీసులు యాక్షన్ తీసుకోరా..? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ఏమైనా కనెక్ట్ అయి ఉంటారా అనేది చూస్తే..

అలా ఏమీ ఉండదు సినిమాలో నకిలీ నోట్లను ఉపయోగించాల్సి వస్తే ఒక సైడ్ మాత్రమే నోటుని ప్రింట్ చేస్తారు. మరొక వైపు చూస్తే మనకి అది నకిలీ నోట్లు అని తెలిసిపోతుంది. ఒకవేళ ఇంకా బాగా క్లియర్ గా నోట్లని చూపించాల్సి వస్తే సినిమాలో చూపించే నోట్ల మీద వుండే సంతకాలు, అక్షరాలు వంటి వాటిని మారుస్తూ ఉంటారు.

సులభంగా ఇవి నకిలీ నోట్లు అని మనం తెలుసుకోవచ్చు. అయితే వీళ్ళని జైల్లో పెట్టరా..? అనే విషయానికి వస్తే.. 2002లో ‘రష్ అవర్ టు’ అనే సినిమాలో నకిలీ నోట్లు అవసరమయ్యాయి. అప్పుడు వాళ్లు ఒక ట్రిలియన్ నకిలీ నోట్లని ప్రింట్ చేశారు. కానీ అవి అచ్చం రియల్ నోట్స్ లాగే ఉన్నాయి దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి నకిలీ నోట్లని ప్రింట్ చేసే విషయంలో చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే జైలు కి వెళ్ళాల్సి వస్తుంది.


End of Article

You may also like