Ads
భారతదేశంలో అతి పెద్ద ట్రాన్స్ పోర్ట్ సంస్థ రైల్వే. ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రతిరోజు రైళ్లలో లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. దేశ వ్యాప్తంగా ప్రతి రోజు వేలాది ట్రైన్స్ నడుస్తున్నాయి.
Video Advertisement
అయితే పలు ప్రాంతాల గుండా తిరిగే రైళ్ళకు పేర్లు ఉంటాయని అందరికి తెలిసిందే. రాజధాని, దురంతో, శతాబ్ది, గరీభ్ రథ్ లాంటి పేర్లతో రైళ్లు ఉన్నాయి. అయితే రైళ్ళకు పేర్లు ఎలా పెడతారు? దురంతో, శతాబ్ది పేర్లకు గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భారతీయ రైల్వే సంస్థ రైళ్లకు పేర్లు ఎలా పెడుతుందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. రైళ్లకు వాటి పేర్లను ఎలా పెడుతారనేది ఆసక్తికరమైన విషయం. సాధారణంగా రైళ్లకు వాటి గమ్యస్థానాలనే పేర్లుగా నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇతర పేర్లను పెడతారు. అలాగే ట్రైన్ ప్రయాణించే ప్రాంతాలలో వాడుకలో ఉన్న పేర్లను కూడా నిర్ణయిస్తారు. శతాబ్ది ఎక్స్ ప్రెస్ 1989లో మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 100 సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రారంభం అయ్యింది. అందుకే ఆ ట్రైన్ కు శతాబ్ది అని పేరును నిర్ణయించారు. ఇక రాజధాని ఎక్స్ ప్రెస్ దేశ రాజధాని డిల్లీ నుండి వేరే ప్రాంతాలకు మధ్య నడిచే రైలు. ప్రధానంగా ఢిల్లీ నుండి ఇతర రాష్ట్రాల రాజధానుల నడుమ ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. అందువల్ల దీనికి రాజధాని పేరు నిర్ణయించారు.
దురంతో ఎక్స్ ప్రెస్ విషయానికి వస్తే, దురంతో అనగా అవాంతరాలు లేనిది అని అర్ధం. ఇక శబరి ఎక్స్ ప్రెస్ కు శబరిమల వెళ్లే ప్రయాణికుల కోసం, అందువల్ల శబరి ఎక్స్ ప్రెస్ అనే పేరును పెట్టారు. ప్రత్యేకమైన పేర్లు తక్కువగా ఉంటాయి. ఎక్కువగా మాత్రం వాటి గమ్యస్థానం పేర్లనే రైళ్ల పేర్లుగా నిర్ణయిస్తుంటారు.
Also Read: రైలు పట్టాలపై కంటే.. వంతెనపై ప్రయాణించేటప్పుడు ఎందుకు ఎక్కువ శబ్దం వస్తుంది? అసలు కారణం ఇదే!
End of Article