Ads
చేసే ప్రతి పనికి ముహూర్తం చూసుకొని మరి ప్రారంభించడం అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మతాలు మరియు సంప్రదాయాల్లో కూడా ఈ అలవాటు ఉండటం పరిపాటి.
Video Advertisement
అయితే చంద్రుడి గమనాన్ని ఆధారంగా చేసుకొని లెక్క కట్టే పంచాంగాలు క్యాలెండర్లను ఆధారంగా చంద్రుడు మీదకే వెళుతున్న గమనానికి ముహూర్తం పెట్టడం జరిగింది.
చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసుకున్న ఇస్రో జూలై 14 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాకెట్ ప్రయోగం జరపడం జరిగింది. అయితే చంద్రుడు మీదకు వెళ్లడానికి ముహూర్తం ఎందుకా అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే భూమి మీద చేసే ప్రయాణానికి అంతరిక్షంలో చేసే ప్రయాణానికి ఎంతో వ్యత్యాసం ఉంది కాబట్టి. ఇక్కడ నిర్ణయించబడే ముహూర్తం అనేది కేవలం ఒక మూఢనమ్మకం కాదు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని వేసే ప్రణాళిక కాబట్టి.
మనం ఒక ప్రాంతం నుంచి రెండవ ప్రాంతానికి భూమి మీద వెళ్ళాలి అంటే మనం ప్రయాణానికి తీసుకునే సమయం అనేది వాహనం వెళ్లే వేగాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఒక స్థిరమైన ప్రాంతం నుంచి మరొక స్థిరమైన ప్రాంతానికి వెళ్తాము కాబట్టి ప్రయాణం అనేది మన చేతుల్లో ఉంటుంది. కానీ అంతరిక్షంలో జరిగే ప్రయాణం అలా ఉండదు కదా.
కానీ అంతరిక్షం లో జరిగే ప్రయాణం అంటే భూమి యొక్క గ్రావిటీ అధిగమించి మరీ పైకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే అంతరిక్షంలోకి శాటిలైట్లను ప్రవేశపెట్టడం కోసం లాంచింగ్ ప్యాడ్ నుంచి ఆకాశంలోకి నిర్ధిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి వలయాకార మార్గంను ఎంచుకుంటారు. అయితే నిర్ణయించిన ముహూర్తానికి ఒక్క క్షణం ఆలస్యమైన మరొక నెల ఆగాల్సి ఉంటుందట. ఎందుకంటే చంద్రుడి మీదకు లాండర్ పంపించడం అంటే మనకు నచ్చిన రోజు పంపుతాము అంటే కుదరదు.
అది చంద్రుడు యొక్క దశలను బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. చంద్రుడు మీద దిగిన తర్వాత అవసరమైన పరిశోధనలు చేయడానికి లాండర్ మరియు రోవర్ మోడ్యులకు అక్కడ విద్యుత్ అవసరం ఉంటుంది. అవి సౌర శక్తి ద్వారానే విద్యుత్ పొందుతాయి కాబట్టి సూర్యరస్మి ఉండాలి అంటే చంద్రుడు మీద పగలు ప్రారంభమయ్యే సమయానికి ల్యాండింగ్ జరగాలి.
watch video :
ALSO READ : “చంద్రయాన్-3” ప్రత్యేకత ఏంటి..? ఇది చంద్రుడి మీదకి ఏం తీసుకెళ్తోంది..?
End of Article