Ads
ఎండా కాలం మెుదలయింది. భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజూకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ వేడి కారణంగా చాలా మందికి వడదెబ్బ తగలడం, డ్రీహైడ్రేషన్ కు గురవడం జరుగుతుంది. ఈ ఎండ వేడి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోజూ ఒక్క గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే చాలు అని అందరూ చెబుతూ ఉంటారు.
Video Advertisement
కొబ్బరి నీళ్లలో మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ. వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న కొబ్బరి నీళ్లు ఎలా తయారవుతాయి తెలుసా..?? అసలు కొబ్బరి కాయ లోకి నీళ్లు ఎలా వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా..??.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కొబ్బరి చెట్లు బాగా పెరగాలంటే వాటికీ పుష్కలం గా నీళ్లు కావాలి. అందుకే ఇవి నదీ పరివాహక ప్రాంతాలు లేదా.. తీరప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ చెట్లకు నీటిని ఎక్కువగా పీల్చుకొనే లక్షణం ఉంటుంది. వాటి వేర్ల ద్వారా ఇవి నీటిని శోషించుకుంటాయి. మిగతా చెట్లతో పోలిస్తే కొబ్బరి చెట్లకు ఈ గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియను ఓస్మాసిస్ అంటారు.
ఇలా వెళ్లిన నీటిలో కొంత భాగం కొబ్బరి కాయల్లోకి వెళ్తాయి. దీన్ని ఎండోస్పెర్మ్ అంటారు. దీనిలోని కొంత భాగం కొబ్బరిగా మారుతుంది. కొన్ని రోజులకు అది గట్టి పడుతుంది. ఇక మిగిలిన ఎండోస్పెర్మ్ నీటిగా అలాగే మిగిలిపోతుంది. అవే కొబ్బరి నీళ్లు. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఈ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురవ్వరు, అలసట ఉండదు. బీపీ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. వాంతులు, విరేచనాలతో బాధపడే వారు ఈ కొకొనట్ వాటర్ తాగితే చాలా వెంటనే ఉపశమనం లభిస్తుంది.
End of Article