లోకేష్ కనగరాజ్ స్టోరీ… విజయ్ సేతుపతి హీరో..! ఈ సినిమా గురించి తెలుసా..?

లోకేష్ కనగరాజ్ స్టోరీ… విజయ్ సేతుపతి హీరో..! ఈ సినిమా గురించి తెలుసా..?

by Anudeep

Ads

‘ఫర్జి’ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోకి ఎంటర్ అయిన విజయ్ సేతుపతి మరోసారి హిందీ ప్రేక్షకులను పలకరించారు. ఆయన నటించిన ముంబైకర్ మూవీ జూన్ 2 నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

  • చిత్రం : ముంబైకర్
  • నటీనటులు : విజయ్ సేతుపతి, విక్రాంత్ మస్సీ, తాన్యా మాణిక్‌తలా, రాఘవ్ బిర్నానీ
  • నిర్మాత : అవి అరద్, అమీ పాస్కల్, ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మల్లర్ , క్రిస్టినా స్టెయిన్‌బర్గ్
  • దర్శకత్వం : సంతోష్ శివన్
  • సంగీతం : సలీల్ అమృతే, రామ్ సురేందర్
  • విడుదల తేదీ : జూన్ 2 , 2023
  • ఓటీటీ వేదిక : జియో సినిమా

Mumbaikar movie-story-review-rating

కథ :

ఒక గ్యాంగ్ స్టర్ అయిన విజయ్ సేతుపతి ఒక పిల్లాడ్ని కిడ్నాప్ చేస్తాడు. వేరే పిల్లాడికి బదులు అతడు ఈ పిల్లాడ్ని కిడ్నాప్ చేస్తాడు. అయితే ఆ పిల్లాడు ముంబైలో ఓ డాన్ కొడుకే కావడం ఇక్కడ ట్విస్ట్. సినిమా మొత్తం దీని చుట్టే తిరుగుతుంది. ఓ మాఫియా డాన్ కొడుకు కిడ్నాప్‌కు గురైతే.. ఊహించని రీతిలో సామాన్యుల జీవితాలు ఎలా అల్లకల్లోలం అవుతాయి. కిడ్నాపర్లు, పిల్లవాడికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అన్నవి సినిమా చూసి తెలుసుకోవాలి.

Mumbaikar movie-story-review-rating

రివ్యూ:

ఈ చిత్రం కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గతంలో తెరకెక్కించిన ‘మానగరం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ‘మానగరం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని అందుకుంది. తెలుగులో కూడా ‘నగరం’ అనే పేరుతో ఈ సినిమా డబ్ అయింది. ఇక ఇదే సినిమాని చిన్న చిన్న మార్పులతో ‘ముంబై కర్’ అనే పేరుతో హిందీలో తెరకెక్కించారు.

Mumbaikar movie-story-review-rating

 

ఈ మూవీ లో ముంబైని పూర్తిస్థాయిలో చూపించే ప్రయత్నం చేసారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ కాస్త గజిబిజిగా ఉంది. ఈ సినిమాలోని పాత్రలు ఆసక్తికరం గా ఉన్నాయి కానీ.. కథ అంత బలంగా లేదు. కొన్ని ఉప కథలను క్లైమాక్స్ లో కలిపే ప్రయత్నం చేసారు. కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇందులో విజయ్ సేతుపతి హిందీ మాట్లాడే తీరు నవ్వు తెప్పిస్తుంది. రణవీర్ షోరే. విక్రాంత్ మాస్సే, తాన్య మానిక్త, సంజయ్ మిశ్రా పరిధి మేరకు నటించారు.

Mumbaikar movie-story-review-rating

అయితే ఈ చిత్రంలోని నటుల వల్ల అంచనాలు బాగా పెరిగిపోయాయి. కానీ ఈ సినిమా ఆ అంచనాలు అందుకోలేదు. కొన్ని చోట్ల మెరుపులు కనిపిస్తాయి. దర్శకుడిగా సంతోష్ శివన్ కొంతవరకు విజయం సాధించారు. కెమెరా యాంగిల్స్లో కొంచెం స్పష్టత లోపించింది. సంగీతం ఓకే.

ప్లస్ పాయింట్స్:

  • విజయ్ సేతుపతి
  • కామెడీ
  • క్లైమాక్స్

Mumbaikar movie-story-review-rating

మైనస్ పాయింట్స్:

  • బలమైన స్టోరీ లేకపోవడం
  • స్క్రీన్ ప్లే

రేటింగ్: 3 /5

Mumbaikar movie-story-review-rating

ట్యాగ్ లైన్: ముంబైకర్ మూవీ ఈ వీకెండ్ కి ఒక్కసారి చూడగలిగే కామెడీ ఎంటర్టైనర్..

 

Watch trailer:


End of Article

You may also like