తమిళ, తెలుగు భాషల్లో సంచలనం సృష్టించిన చిత్రం “పిజ్జా”. ఈ మూవీ విజయ్ సేతుపతికి హీరోగా, కార్తీక్ సుబ్బరాజుకి  దర్శకుడిగా బలమైన పునాది వేసింది. ఈ  సిరీస్‌లో వచ్చిన మూడవ సినిమా “పిజ్జా 3: ది మమ్మీ”.

Video Advertisement

ఈ మూవీలో అశ్విన్ కకుమాను హీరోగా నటించారు. ఈ చిత్రం తమిళంలో జులై లో రిలీజ్ అయ్యి, యావరేజ్ గా నిలిచింది. ఆ మూవీని అదే టైటిల్ తో తెలుగులో డబ్ చేసి, ఆగస్ట్ 18న రిలీజ్ చేశారు. అయితే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
పిజ్జా 3 మూవీలో అశ్విన్ కాకుమాను, పవిత్ర మరిముత్తు జంటగా నటించారు. మోహన్ గోవింద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, నలన్ (అశ్విన్ కకుమాను) ఒక ఫేమస్ రెస్టారెంట్ కు ఓనర్. అతను  కయల్ (పవిత్ర) ను ప్రేమిస్తాడు. ఆమె యాప్ డెవలపర్ గా వర్క్ చేస్తుంటుంది. నలన్ కయల్ తో పెళ్లి గురించి ఆమె అన్నయ్య ప్రేమ్ (గౌరవ్ నారాయణన్) పోలీసు అధికారితో మాట్లాడగా, అతను నలన్ అవమానిస్తాడు.
నలన్ రెస్టారెంట్‌లో కొన్ని వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. నలన్ కు తెలిసిన వ్యక్తులు వరసగా చనిపోతుంటారు. వాటికి కారణం చిన్న ఈజిప్ట్ మమ్మీ బొమ్మ. వరుస మరణాలకు, ఈ బొమ్మకు ఉన్న సంబంధం ఏమిటి?  ఆ బొమ్మలో ఉన్న ఆత్మ వారిని చంపడానికి కారణం ఏమిటి ? చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ. అశ్విన్ కకుమాను ఇప్పటికే చాలా సినిమాలలో నటించి యాక్టర్ గా సత్తాను చాటుకున్నాడు. పలు హారర్ చిత్రాలలో నటించిన అశ్విన్ ఈ మూవీలో కూడా ఆకట్టుకున్నాడు. పిజ్జా 3 రొటీన్ హారర్ రివెంజ్ మూవీ. తమిళంలోనే యావరేజ్ గా నిలిచిన మూవీని తెలుగులో విడుదల చేశారు. ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ ఇలాంటివి ఎన్నో చూశారు. దాంతో ఈ మూవీ చూస్తున్నప్పుడు తరువాత వచ్చే సీన్ సులభంగా ఊహించగలరు. హర్రర్ మూవీ అయినా అంతగా భయపెట్టలేదు. డబ్బింగ్ క్వాలిటీ బాగుంది.

Also Read: “బుద్ధి లేదా… ఇలా పరువు తీస్తారా..?” అంటూ… ఈటీవీ “శ్రీదేవి డ్రామా కంపెనీ” మీద కామెంట్స్..! ఏం జరిగిందంటే..?