మనం వంటకాలలో ఉపయోగించేటటువంటి పదార్థాలలో యాలకులు చాలా ముఖ్యం. చేసే వంటలు రుచిగా ఉండాలంటే యాలకులు వేయాల్సిందే. యాలకులకు రుచి ఇచ్చే శక్తియే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగు పరిచే శక్తి కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి యాలకులను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం..!!

Video Advertisement

యాలకులను సుగంధద్రవ్యాలు అని కూడా అంటారు. ఇవి ఆహారంలో ఉపయోగిస్తే జీర్ణ వ్యవస్థ మెరుగు పడటానికి సహాయపడుతుంది. ఇది అత్యంత సువాసన గల పదార్థాలలో ప్రథమ స్థానంలో ఉంటాయి. ఇందులో ఉండే కొన్ని రసాయనాలు మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇందులో చిన్న యాలకులు మరియు పెద్ద యాలకులు అని రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండు ఔషధ గుణం కలిగి ఉంటాయి. యాలకులు నిద్రలేమి సమస్యను దూరం చేయడమే కాకుండా రక్త ప్రసరణ వ్యవస్థను

మెరుగుపరుస్తుంది. డైసురియా, అజిర్ణం, ఉబ్బసం, వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. గురక, దాహం, వాంతులు వంటి సమస్యలకు కూడా మంచి ఫలితాలనిస్తుంది. అలాగే నోటి పూత, దగ్గు లాంటి వాటి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. యాలకుల గింజలు నమలడం వల్ల నోటిలో ఉండే క్రిములు నశించి నోటి దుర్వాసన కూడా పోతుంది. కాబట్టి యాలకులను ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది.