Ads
ఒక బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో తల్లి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటు ఉంటుంది. కేవలం శారీరక సమస్యలు మాత్రమే కాకుండా మానసిక సమస్యలు కూడా తను ఎదుర్కోవాల్సి ఉంటుంది నిజానికి అమ్మతనాన్ని స్వీకరించడం అంత సులభం కాదు.
Video Advertisement
ఎన్నో సమస్యలు తొమ్మిది నెలలలో వస్తూ ఉంటాయి. వాంతులు, వికారం, బ్లడ్ తగ్గిపోవడం, డయాబెటీస్ ఇలా శారీరకంగా చాలా మంది వివిధ అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు.
మానసికంగా కూడా చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇవన్నీ ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఇక ఇదిలా ఉంటే బిడ్డ పుట్టేసిన తర్వాత మరొక బిడ్డకు జన్మనివ్వడం కోసం ఎంత సమయం తీసుకోవాలి..?, ఎంత గ్యాప్ తీసుకుంటే మంచిది అనేది చాలా మందిలో ఉండే ప్రశ్న. అయితే మరి తల్లులు ఎంత గ్యాప్ తీసుకుని మరొక బిడ్డకు జన్మనివ్వచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణులు ఒక బిడ్డకి మరొక బిడ్డకు మధ్య రెండు నుండి మూడు సంవత్సరాల గ్యాప్ ఉంటే మంచిదని అంటున్నారు.
బిడ్డకు జన్మనివ్వడం వల్ల ప్రెగ్నెన్సీ లో వచ్చిన మార్పులు మళ్లీ పూర్తిగా పోతాయి. నార్మల్ డెలివరీ అయితే ఒక అర లీటర్ వరకు రక్తాన్ని స్త్రీ కోల్పోతుంది. అదే సీ-సెక్షన్ అయితే ఒక లీటర్ వరకు రక్తాన్ని కోల్పోతారు. ఈ రక్తం మళ్లీ చేరుకోవాలంటే.. ఎంత మంచి డైట్ తీసుకున్న కనీసం రెండు ఏళ్ళు పడుతుంది. కనుక ఒక బిడ్డకు మరొక బిడ్డకు మధ్య రెండు నుండి మూడు ఏళ్ళు గ్యాప్ ఇస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రెండో బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు మొదటి బిడ్డ కొంచెం పెద్దయి స్కూల్ కి వెళ్లేలా ఉంటే మంచిది. అలాంటప్పుడు తల్లికి బిడ్డను చూసుకోవడం సులభం అవుతుంది. చాలా మంది రెండు నుంచి మూడు ఏళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఇస్తూ ఉంటారు దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు.
కానీ స్త్రీ మరియు పురుషుల యొక్క ఆరోగ్యం చూసుకుంటూ ఉండాలి ఇది తప్ప మరొక సమస్య ఉండదు. బాగా ఎక్కువగా గ్యాప్ తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిగా అయ్యిపోయి నార్మల్ డెలివరీ అవ్వదు. కేవలం ఇలాంటి సమస్యలు మాత్రమే ఉంటాయి తప్ప ఇతర సమస్యలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
End of Article