మరణం తర్వాత కూడా లక్షల్లో ఆదాయం..! ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

మరణం తర్వాత కూడా లక్షల్లో ఆదాయం..! ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

by kavitha

Ads

పాపులర్ పంజాబీ గాయకుడు ‘సిద్దూ మూసేవాలా’ గత ఏడాది మే 29న దుండగుల చేతిలో దారుణంగా చంపబడిన  విషయం తెలిసిందే. అతను మరణించినప్పటికి సిద్దూ మూసేవాలా పాటలు భారీగా ఆర్జిస్తున్నాయి. ఏప్రిల్ 7 2023న సిద్దు కొత్త పాట విడుదల అయింది. యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సాంగ్ 5 గంటల్లోనే ఐదున్నర మిలియన్ల పైగా వ్యూస్ పొందింది.

Video Advertisement

సిద్దూ మూసేవాలా 29 ఏళ్ల వయసులోనే మరణించినా, ఇప్పటికీ ఆయన తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ ద్వారా, అలాగే  యూట్యూబ్ డీల్‌, రాయల్టీల ద్వారా కూడా కోట్లు ఆర్జించగలిగాడు. ఇక ఆయన ఆస్తులన్నీటిని సిద్దూ పేరెంట్స్ కు బదిలీ చేశారు. ఆయన చనిపోయే సమయానికి సిద్దూ ఆస్తుల విలువ దాదాపు 14 మిలియన్ డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీ లో 100 కోట్ల కన్నా ఎక్కువ. సిద్ధుకు లగ్జరీ కార్లు, ఇంకా ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దూ మూసేవాలా లైవ్ షో, కచేరీ లాంటి వాటికి దాదాపు ఇరవై లక్షలు, పబ్లిక్ షోస్ కు రెండు లక్షల వరకు తీసుకునేవాడని సమాచారం.punjabi-singer-sidhu-moose-wala2సిద్దూ మూసేవాలా చిన్న వయసులోనే గాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ చనిపోయిన తరువాత సంపాదిస్తోంది. యూట్యూబ్ పాలసీల ద్వారా, వ్యూవ్స్ ద్వారా రాయల్టీలు ఇస్తోంది. ఒక వీడియో లేదా ఒక పాట కానీ  మిలియన్ వ్యూస్ పొందినట్లయితే యూట్యూబ్ దానికి 1000 డాలర్లను ఇస్తుంది. రీసెంట్ గా రిలీజ అయిన సిద్ధూ కొత్త సాంగ్ 18 మిలియన్ల పైగా వ్యూస్ సంపాదించింది. అందువల్ల ఈ పాటకు యూట్యూబ్ ప్రస్తుతానికి రూ. 14.3 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పాటకు మరిన్ని వ్యూస్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
punjabi-singer-sidhu-moose-walaఇవే కాకుండా సిద్ధూ మూసేవాలా వింక్, స్పాటిఫై లాంటి ప్లాట్‌ఫామ్‌ల నుండి రాయల్టీ మరియు అడ్వర్టైజ్‌మెంట్ డీల్స్  ద్వారా చనిపోయిన తరువాత కూడా తన పాటల వల్ల రెండు కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా సంపాదించాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన వీడియోలో సిద్దు గాత్రానికి నైజీరియన్ గాయకుడు రాప్ ను అందించారు. ఈ వీడియోలో టెక్నాలజీ సహయంతో సింగర్ సిద్దు మూసే వాలా కనిపించేట్లుగా చేశారు.
punjabi-singer-sidhu-moose-wala1Also Read: “అనితా ఓ అనితా” సింగర్ నాగరాజు గుర్తున్నారా..? ఇప్పుడు అతని పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసా..?


End of Article

You may also like