ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. సినిమాకి అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం రాజమౌళితో పాటు ఇలా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం. సినిమా ప్రమోషన్స్ లో కూడా రాజమౌళితో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఆ ఇద్దరు హీరోలు ఎంత స్నేహంగా ఉంటారో ఈ ప్రమోషన్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు చూస్తే అర్థం అయిపోతుంది.
Video Advertisement
అయితే ఇటీవల ఈ సినిమాలో బెస్ట్ యాక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతో పెద్ద అవార్డ్ అయిన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ కి పంపాలి అంటూ ఒక ప్రముఖ మ్యాగజిన్ రాసింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ కి వెళ్లట్లేదు అంటూ వార్త వచ్చింది. ఆస్కార్ అవార్డుల్లో ఇప్పటి వరకు భారతీయ సినిమాలు వెలుగులు విరజిమ్మలేదు. బ్రిటిష్ కాలాబోరేషన్స్ లో వచ్చిన ‘గాంధీ’, ‘స్లం డాగ్ మిలియనీర్’ చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లగలిగాయి.
అయితే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ కు నామినేట్ అయినట్లయితే క్యాంపైన్ (ప్రింట్ అండ్ అడ్వర్టైజింగ్) కోసం నిర్మాత డివివి దానయ్య చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏదైనా మూవీ ఆస్కార్ కు నామినేట్ అయితే దాని కోసం ప్రత్యేకంగా పబ్లిసిటీ కాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. అక్కడి ఆడియన్స్, ఫిల్మ్ మేకర్స్ కు స్పెషల్ షో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
గతంలో కూడా అత్యధిక ఆస్కార్ అవార్డులు అందుకున్న “పారాసైట్” సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ కోసం దాదాపుగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. ఓవరాల్ గా 17నుంచి 18 మిలియన్ డాలర్స్ అంటే 120 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆస్కార్ కి సెలెక్ట్ అయిన తర్వాత నామినేట్ అవ్వడం కోసం సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని కొంతమంది నిర్మాతలు అంటున్నారు. “విశారనై” ప్రొడ్యూసర్ అయిన ధనుష్ ఖర్చుకు వెనకాడకుండా ప్రమోషన్స్ చేసాడు. కానీ ఆ మూవీ మాత్రం ఆస్కార్ కు నామినేట్ కాలేకపోయింది.
ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ గనుక ఆస్కార్ కు నామినేట్ అయితే నిర్మాతలు తక్కువలో తక్కువ 30 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆస్కార్ అవార్డు వచ్చినట్లయితే మాత్రం సినిమా వరల్డ్ ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. అందుకే రాజమౌళి ఖర్చుకు వెనకాడకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కరోనా తో సినిమా పరిశ్రమ కుదేలైన తర్వాత ఎనర్జీని అందించినట్టు, ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించి రాజమౌళి సినీ ఇండస్ట్రీని మళ్లీ టాప్ లెవెల్ లోకి తీసుకువచ్చారు. ఈ మూవీలో రామ్ చరణ్ సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అదరగొట్టారు.