Ads
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం అయ్యింది. ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా, గ్రాండ్ గా నిర్వహించడానికి బీసీసీఐ సినీ తారలు మరియు బాలీవుడ్ గాయకులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నేషనల్ క్రష్ రష్మిక మందాన మరియు మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా తమ డాన్స్‌తో ఆడియెన్స్ ని అలరించారు.
Video Advertisement
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట, పుష్ప సినిమాలోని శ్రీ వల్లి, సామీ సామీ, ఊ అంటావా మావా లాంటి పాటలకు రష్మిక, తమన్నా స్టెప్పులేసి అలరించారు. వీరిద్దరి పెర్ఫార్మెన్స్ తో స్టేడియం హోరేత్తింది.ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్ కూడా తన పాటలతో ఆడియెన్స్ ని అలరించారు.ఐపీఎల్ 16వ సీజన్లో మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఆడాయి. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై గుజరాత్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. అహ్మదాబాద్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి 178 రన్స్ చేసింది.
ఇక 179 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు మికహ మొదటి నుండి కూడా అదరగొట్టారు. దాంతో గెలుపు సాధించారు. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలలో స్టార్ హీరోయిన్లు ష్మిక మందాన, తమన్నా భాటియా డాన్స్ చేయడం పై ప్రస్తుతం చర్చ మొదలైంది. అయితే ఈ వేడుకల్లో డాన్స్ చేసినందుకు గాను హీరోయిన్లు రష్మిక, తమన్నా భాటియా ఇద్దరు తలో నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.
Also Read: రజనీకాంత్ మూవీ వల్ల నా కెరీర్ ముగిసిపోయింది.. వైరల్ అవుతున్న మనీషా కోయిరాల కామెంట్స్
End of Article