మందు తాగి బండి నడపద్దు… కానీ అసలు మందు తాగిన తర్వాత అది మన బాడీ లో ఎంతసేపు ఉంటుంది..?

మందు తాగి బండి నడపద్దు… కానీ అసలు మందు తాగిన తర్వాత అది మన బాడీ లో ఎంతసేపు ఉంటుంది..?

by kavitha

Ads

ప్రస్తుతం యువతలో మద్యం తాగే ట్రెండ్ నెలకొంది. కొంత మంది యువకులు హాబీ కోసం, మరికొందరు స్టైల్ కోసం మద్యం తాగుతున్నారు. ఆల్కహాల్ ఒక మాదక పదార్ధం. ట్రాఫిక్ నియమాలు.. సైన్ బోర్డు లు ఎప్పటికప్పుడు వాహనదారులను హెచ్చరిస్తూనే ఉంటాయి. అయినా ప్రజలు వీటిని లెక్క చెయ్యక పోవడం ద్వారా అనేక ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.

Video Advertisement

image credits: indtoday

ఆల్కహాల్ శరీరంలో ఉండేది కొద్ది కాలమే అయినా దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. మీరు ఆల్కహాల్ తాగినప్పుడు అది మీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత అది నెమ్మదిగా మొత్తం శరీరానికి చేరుతుంది. ఆల్కహాల్ మెటబాలైజ్ కావడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో మద్యం సేవించిన తర్వాత అది శరీరంలో ఎంతకాలం ఉంటుంది. దాని ప్రభావం ఏమిటో తెలుసుకుందాం..

how much time will alcohol stays in body

ఒక్కోసారి ఆల్కహాల్ సేవించిన తర్వాత రాత్రి అంతా హ్యాంగోవర్‌ ఉంటుంది. కొన్ని సార్లు హ్యాంగోవర్ రెండు రోజులు కూడా ఉంటుంది. వికారం, వాంతులు మరియు తేలికపాటి తలనొప్పి కూడా ఉంటాయి. కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ లేదా ఇతర పానీయాలు ఆల్కహాల్ ద్వారా వచ్చిన మత్తును త్వరగా తగ్గించడం లో సహకరిస్తాయి.

how much time will alcohol stays in body
మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా అది మొదట జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. ఆహారం, ఇతర పానీయాల మాదిరిగా ఆల్కహాల్ జీర్ణం కాదని తెలుసుకోవాలి. అయినా దాదాపు 20 శాతం ఆల్కహాల్ నేరుగా రక్తంలోకి వెళుతుంది, అది మీ మెదడుకు చేరుకుంటుంది. మిగిలిన 80 శాతం పేగుల్లోనే ఉంటుంది. ఇది కాలేయంపై కూడా ప్రభావం చూపుతుంది. మీరు మద్యం సేవించిన ఏడు, ఎనిమిది గంటల తర్వాత కూడా దాని ప్రభావం శరీరం లో ఉంటుంది. నేటి కాలంలో, మద్యం సేవించిన 80 గంటల తర్వాత, మీరు మూత్ర పరీక్ష ద్వారా మద్యం సేవించిన సమయాన్ని తెలుసుకోవచ్చు.

how much time will alcohol stays in body
కానీ మద్యపానం హాని కరం కాబట్టి ప్రతి ఒక్కరు దానికి దూరం గా ఉండేందుకు ప్రయత్నించాలి. అలా చేయలేని వారు సిట్రస్ జాతి పండ్లు అంటే క‌మ‌లా, నిమ్మ‌, దానిమ్మ‌, బొప్పాయి, ద్రాక్ష‌ వంటివి డైట్‌లో చేర్చుకుంటే.లివర్‌కు జరిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ను నివారిస్తాయి.అదేవిధంగా, వెల్లుల్లి, అల్లం ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే.లివర్‌లో పేరుకుపోయిన వ్యర్ధ పదార్ధాలను నాశనం చేయ‌డంతో పాటు మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా చేకూరుస్తాయి.


End of Article

You may also like