బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. అదే ఫ్రెండ్షిప్ తో గతేడాది చిరంజీవిగాడ్ ఫాదర్ లో సల్మాన్ నటించారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్ కోసం అదే పని చేశాడు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. విక్టరీ వెంకటేశ్ కూడా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు.

Video Advertisement

 

 

తమిళ హీరో అజిత్ నటించిన ‘వీరం’ చిత్రానికి ఇది రీమేక్. ఈ మూవీ లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీ నుంచి ‘ఏంటమ్మా.. ఏంటమ్మా..’ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో సల్మాన్-వెంకీతోపాటు రామ్ చరణ్ కూడా కాలు కదిపారు. ఊరమాస్ సాంగ్ లో లుంగీ కట్టి ముగ్గురూ వేసిన స్టెప్స్ ముగ్గరు హీరోల ఫ్యాన్స్ ను అలరిస్తోంది. అచ్చ దక్షిణాది పాటలా తెరకెక్కిన పాటకు జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు.

how ram charan be a part of entamma entamma song..!!

రామ్ చరణ్ ఎంట్రీ పాటకు స్పెషల్ గా నిలిచింది. ఇద్దరు లెజెండ్స్ తో డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉందని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అయితే ఈ సాంగ్ లోకి రామ్ చరణ్ ఎలా వచ్చాడో సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ పాట చిత్రీకరణ మొత్తం ‘ఆచార్య’ సినిమా కోసం వేసిన ధర్మస్థలి సెట్ లో జరిగింది. ఆ సినిమాకి రాంచరణ్ కూడా ఓ నిర్మాత అన్న సంగతి తెలిసిందే.

how ram charan be a part of entamma entamma song..!!

ఓ రోజు షూటింగ్ చూడటానికి అని వచ్చిన చరణ్ కు … సల్మాన్, వెంకీ ల తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనే ఫీలింగ్ కలిగిందట. ఇదే విషయాన్ని సల్మాన్ కు చెప్పాడు చరణ్. అందుకు సల్మాన్ ఒప్పుకోలేదట. అయినా చరణ్ పట్టుబట్టడంతో చూద్దాం లే అన్నాడట సల్మాన్ ఖాన్. కానీ ఆ నెక్స్ట్ రోజు చరణ్ మేకప్ వేసుకుని వచ్చేసినట్టు సల్మాన్ ఖాన్ చెప్పాడు. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ గతంలో ‘గాడ్ ఫాదర్’ మూవీ ప్రెస్ మీట్‌‌లో కూడా తెలిపాడు.