మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Video Advertisement

 

ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం చేసారు మేకర్స్. అయితే ఈ మూవీలో రవితేజ .. విక్రమ్ సాగర్ అనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. ఈయనకి జోడీగా కేథరిన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పుడు రవితేజ ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు ప్రకటించలేదు. కానీ తర్వాత ఇందులో రవితేజ ఎంటర్ అయ్యాడు.

how raviteja got into waltair veerayya movie..

రవితేజ గతం లో మైత్రి మూవీ మేకర్స్ లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం లో నటించారు. ఆ చిత్రం వాళ్ళ భారీ నష్టాలు రావడం తో.. మైత్రి వారితో మరో చిత్రం చేస్తా అని రవితేజ అగ్రిమెంట్ చేశారట. ఆ తర్వాత కథలు కూడా చాలా వినిపించారు మైత్రి వారు. అయితే చివరికి వాల్తేరు వీరయ్య తో ఆ అగ్రిమెంట్ పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రవితేజ రోజుకి రూ.25 లక్షలు ఛార్జ్ చేశాడట. 11 రోజుల పాటు అతను వాల్తేరు వీరయ్య షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.

how raviteja got into waltair veerayya movie..
అయితే చిరు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతోంది. మాస్ మహారాజా రవితేజ మరో ప్రత్యేక కథానాయకుడిగా నటించిన చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం లో రవి తేజ పాత్ర హైలైట్ కానుందట. ఇటీవల రవితేజకు సంబంధించిన టీజర్ విడుదలై కేక పెట్టించింది. తెలంగాణ యాసలో ఆయన వావ్ అనిపించారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో రవితేజ ఓ నలబై నిమిషాల పాటు కనిపించనున్నారని తెలుస్తోంది.