ఫ్యాక్టరీ లో “సానిటరీ ప్యాడ్స్” ఎలా తయారవుతాయో తెలుసా.?

ఫ్యాక్టరీ లో “సానిటరీ ప్యాడ్స్” ఎలా తయారవుతాయో తెలుసా.?

by Mohana Priya

Ads

ప్రతి ప్రదేశం లో మెడిసిన్స్ తో పాటు కచ్చితంగా అందుబాటులో ఉండాల్సిన వస్తువుల్లో శానిటరీ ప్యాడ్స్ ఒకటి. శానిటరీ ప్యాడ్స్ 1888లో కనిపెట్టారు అని కొంతమంది అంటే, 19వ శతాబ్దంలో వరల్డ్ వార్ సమయంలో కనిపెట్టారు అని మరికొంతమంది అంటారు.

Video Advertisement

ఈ శానిటరీ ప్యాడ్స్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు కటింగ్ మెషిన్ ద్వారా  కాటన్ ని సేకరిస్తారు. కొన్ని మెషిన్ లలో దాని ద్వారా సేకరించిన కాటన్ అందులోనే శుభ్రపరిచే ఫెసిలిటీ ఉంటుంది. అలాంటప్పుడు ఆ మెషిన్ ద్వారా కాటన్ ని సేకరించి అక్కడే శుభ్రపరిచి ఫ్యాక్టరీ కి తీసుకువెళ్తారు. లేదంటే సేకరించిన కాటన్ ని ఫ్యాక్టరీలో శుభ్రపరుస్తారు.

మిషన్ సహాయం తో కాటన్ ని హాఫ్ మీటర్ వైడ్ లో ఒక పల్చటి లేయర్ లాగా చేస్తారు. వాటిని రోల్ చేసి ఉంచుతారు. తర్వాత మిషన్ సహాయం తోనే ప్యాడ్ షేప్ లో కట్ చేస్తారు. ఒక సానిటరీ ప్యాడ్ కి ఎంత అవసరమో చూసుకొని ఒక ప్యాడ్ కి అవసరమైనంత కాటన్ ని రెక్టాంగిల్ బాక్స్ లో పెడతారు. అందులో పాలిమర్ పౌడర్ మిక్స్ చేస్తారు.

కొన్నిచోట్ల కాటన్ తో పాలిమర్ పౌడర్ మిక్స్ చేసి, డోసర్ అనే మెషిన్ సహాయంతో ఒక ప్యాడ్ కి అవసరమైనంత కాటన్ కట్ చేసి, ఎయిర్ కరెంట్ ద్వారా ప్యాడ్ షేప్ మౌల్డ్ లోకి వచ్చేలా చేస్తారు. తర్వాత మౌల్డ్ లోకి వచ్చిన ప్యాడ్ కన్వేయర్ బెల్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ ఇది టూ లేయర్ ప్యాడ్ అయితే ఒకటే సమయంలో సైమల్టేనియస్ గా రెండు కాటన్  లేయర్ లని తయారుచేసి తర్వాత వాటిని కలుపుతారు.

polymer powder

పాలిమర్ పౌడర్ లో లిక్విడ్ కలిపితే పౌడర్, జెల్ రూపంలో ఎక్స్పాండ్ అవుతుంది. పౌడర్ గా ఉన్న పాలిమర్ జెల్ అయినప్పుడు ఆ లిక్విడ్ పీల్చుకొని పౌడర్ గా ఉన్నప్పటి వాల్యూమ్ కంటే 40 టైమ్స్ పెరుగుతుంది. ఒక్కొక్క పాలిమర్ ఒక్కొక్క రియాక్షన్ స్పీడ్ లో అబ్జార్బ్ చేసుకుంటుంది.

ఈ పాలిమర్ యావరేజ్ రియాక్షన్ స్పీడ్ లో అబ్జార్బ్ చేసుకుంటుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిన ప్యాడ్ షేప్ లో ఉన్న కాటన్ కి రెండు వైపులా షీట్ అతికిస్తారు. ఒక షీట్ అబ్సార్బ్షన్ (obsorption) కి వీలుగా ఉంటే, ఇంకొక షీట్ నాన్ లీకబుల్ ఉంటుంది.

packaging

ఇప్పుడు అలా తయారు చేసిన ప్యాడ్ కి కింద భాగంలో ఒక పేపర్ అంటిస్తారు. కానీ ప్యాడ్స్ అప్పటికి ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి, మొత్తం ఒక చైన్ లాగా ఉంటాయి. వాటిని కటింగ్ డై (డై కటింగ్) తో కట్ చేస్తారు. తర్వాత ఒక్కొక్క ప్యాడ్ ని ఒక్కొక్క పౌచ్ లో పెట్టి వాటిని ప్యాక్ చేస్తారు. ఈ విధంగా ఒక్కొక్క ప్యాడ్ తయారవడానికి 40 సెకండ్ల సమయం పడుతుందట.

watch video :

 


End of Article

You may also like