Ads
ప్లాస్టిక్ సర్జరీ గురించి అందరికి తెలుసు. కానీ, ఈ సర్జరీ లో ప్రాసెస్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. చాలామంది ఈ సర్జరీ లో ప్లాస్టిక్ వాడతారు అనుకుంటారు. కానీ, ఈ సర్జరీ లో ప్లాస్టిక్ ని అస్సలు వాడారు. మరో ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గతం తో పోలిస్తే.. ప్రస్తుతం ప్రపంచం లో అందం పై అందరికి శ్రద్ధ పెరిగింది. అందం గా కనిపించడం కోసం ఒకప్పుడు ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం, క్రీములు అవీ.. ఇవీ రాసుకునే వారు. ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది.
Video Advertisement
మరో వైపు సినీ తారలు అయితే.. ఏకం గా ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించేసుకుంటూ ఉంటున్నారు. ముఖం పై ఉండే చిన్న చిన్న లోపాలను సైతం వారు సవరించుకోవడానికి వెనుకాడడం లేదు. ఇది నిజానికి రిస్క్ తో కూడుకున్న పనే. ఎందుకంటే.. సర్జరీ ఏ మాత్రం అటు ఇటు అయినా.. ఫేస్ పాడైపోతుంది. ఇది ఎంత రిస్క్ అయినా కూడా కొందరు సెలెబ్రిటీలు వెనుకాడకుండా సర్జరీ చేయించుకుని మరింత అందం గా మారారు.
లిప్స్, చీక్స్ వంటి ముఖ భాగాలు ఎంతో సెన్సిటివ్ గా ఉంటాయి. ఈ సర్జరీ చేసే సమయం లో ఫేస్ కి ఒక ఇంజక్షన్ ఇస్తారు. దీనివల్ల ముఖం వరకు స్పర్శ తెలియదు. ఏ భాగం అయితే అందాన్ని చెడగొడుతోందో.. ఆ భాగాన్ని తొలగించి మిగతా చర్మాన్ని కావాల్సినట్లు గా మౌల్డ్ చేస్తారు. ఇందులో ప్లాస్టిక్ ని అస్సలు ఉపయోగించారు. ప్లాస్టికో అనే గ్రీక్ పదం నుంచి ఈ సర్జరీ కి పేరు పెట్టారు. గ్రీకు భాషలో ప్లాస్టికో అంటే మౌల్డ్ చేయడం అని అర్ధం. అందుకే ఈ సర్జరీ కి ఆ పేరు వచ్చింది.
End of Article