Ads
ఆదివారం కూడా వారాల్లో ఒకటి. కానీ ఆదివారం అంటే హాలిడే అని ఎంతోకాలం నుండి మనం ఫిక్స్ అయిపోయాం. అందుకే ఆదివారం వస్తే పని చేయడానికి చాలా మందికి కొంచెం బద్దకంగా అనిపిస్తుంది. వారం మొత్తం పని చేసిన తర్వాత వచ్చే ఆదివారం మాత్రం రెస్ట్ తీసుకునే డే గానే కన్సిడర్ చేస్తారు. అయితే భారతదేశంలో ఆదివారం సెలవు రోజుగా ఎవరు ప్రకటించారో, అసలు భారతదేశంలో ఆదివారం సెలవు ఎలా వచ్చిందో తెలుసా?
Video Advertisement
స్వతంత్రం రాకముందు, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న సమయంలో భారతదేశంలో ఉన్న మిల్స్ లో పని చేసేవాళ్ళు వారంలో ఏడు రోజులు పని చేయాల్సి వచ్చేది. వాళ్లు సెలవు లేదా విశ్రాంతి తీసుకునేవారు కాదు. అప్పుడు నారాయణ్ మేఘాజీ లోఖండే మిల్స్ వర్కర్లకు లీడర్ గా ఉండేవారు.
ఆయన వారంలో ఒకరోజు సెలవు రోజు ఉండాలి అనే ఆలోచనను బ్రిటిషర్స్ దగ్గర ప్రతిపాదించారు.వారంలో ఆరు రోజులు కష్టపడి పని చేసిన తర్వాత వర్కర్స్ కి తమ దేశానికి, సమాజానికి సేవ చేయడానికి ఒక్కరోజు కావాలి అని నారాయణ్ మేఘాజీ లోఖండే అన్నారట.
కానీ బ్రిటిష్ అధికారులు ఈ ప్రతిపాదనని తిరస్కరించారట. నారాయణ్ మేఘాజీ లోఖండే ఈ విషయంపై పోరాటం చేశారు. ఏడు సంవత్సరాల ఉద్యమం తర్వాత 1890లో జూన్ 10 వ తేదీన బ్రిటీష్ గవర్నమెంట్ ఆదివారాన్ని హాలిడే గా డిక్లేర్ చేసిందట.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, భారతదేశంలో ఆదివారం సెలవు దినంగా బ్రిటీష్ గవర్నమెంట్ ప్రకటించింది. భారతదేశ గవర్నమెంట్ ఈ విషయంపై ఎటువంటి ఆర్డర్ జారీ చేయలేదు. కానీ ఏదేమైనా “ఫాదర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఇన్ ఇండియా” అయిన నారాయణ్ మేఘాజీ లోఖండే యొక్క ఏడేళ్ల పోరాటానికి ఫలితంగా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు.
End of Article