దేవాలయాల్లో మనం సమర్పించిన తలనీలాలు (వెంట్రుకలు) ఏమవుతాయో తెలుసా?

దేవాలయాల్లో మనం సమర్పించిన తలనీలాలు (వెంట్రుకలు) ఏమవుతాయో తెలుసా?

by Mohana Priya

Ads

మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తీరాలంటే ఏ దేవుడికి మొక్కు కోవడం మనం అనుకున్నది నెరవేరిన తర్వాత దేవుడికి తలనీలాలు సమర్పించడం అనేది భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న ఆనవాయితీ.

Video Advertisement

తిరుపతిలో అయితే ఎప్పటినుండో తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ విషయం అందరికీ తెలుసు. అలా అనుకున్నది నెరవేరితే తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకొని తర్వాత తలనీలాలు సమర్పిస్తారు. కానీ తలనీలాలు సమర్పించిన తర్వాత ఆ జుట్టు ని ఏం చేస్తారో మీకు తెలుసా?

ముందుగా జుట్టుని ఫ్యాక్టరీలకు తరలిస్తారు. జుట్టు చిక్కులు పడిపోయి ఉంటుంది కాబట్టి సూదుల సహాయంతో చిక్కు తీస్తారు. తర్వాత జుట్టుని శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన జుట్టుని దువ్వెనల సహాయంతో దువ్వుతారు. జుట్టు మొత్తాన్ని ఒక లెవెల్ వచ్చేలాగా కట్ చేస్తారు. ఆ జుట్టు ని భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాలకి కూడా ఎగుమతి చేస్తారు.

ఏ ఒక్కరి జుట్టు ఒకే లాగ ఉండదు. కొంతమంది జుట్టు రింగులు తిరిగి ఉంటే, మరికొంతమంది జుట్టు  స్ట్రైట్ గా ఉంటుంది. అలాగే రంగులు కూడా వేరు వేరు ఉంటాయి. అంతేకాకుండా సహజమైన వెంట్రుకలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జుట్టుకి డిమాండ్ ఉంటుంది. తలనీలాలు సమర్పించిన వెంట్రుకలను ఇలా ఉపయోగిస్తారు.


End of Article

You may also like