Home Off Beat బార్ లో అమ్మాయిని కలిశాడు… ఫోన్ నెంబర్ లో 2 అంకెలు మిస్సింగ్..! ఏం చేసాడంటే..?

బార్ లో అమ్మాయిని కలిశాడు… ఫోన్ నెంబర్ లో 2 అంకెలు మిస్సింగ్..! ఏం చేసాడంటే..?

by Sainath Gopi

ప్రేమ అందమైనది. ప్రేమికులకు ప్రపంచం అందంగా కనిపిస్తుంది. కానీ ఈ అందమైన ప్రేమ అందరికీ దొరకదు. శాశ్వతమైన ప్రేమ, చిరకాల ప్రేమ, నేను లేకుండా నువ్వు లేనని చెప్పే ప్రేమ దొరకడం అదృష్టం అనడంలో సందేహం లేదు. నేటి ఆధునిక కాలంలో ప్రేమ కూడా ఆధునికంగా మారింది. ఇది వరకు కాలం లో లేఖల ద్వారా తెలుపుకున్న ప్రేమ ఆ తర్వాతి కాలం లో ఫోన్స్ కి చేరింది.

అయితే చివరికి మన సోల్ మేట్ మనకి దొరికిన తర్వాత తన ఫోన్ నెంబర్ దొరకకపోతే ఏం చేస్తాం.. అయితే ఇటువంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది. ఓ బార్ లో ఒక యువకుడికి తన సోల్ మేట్ దొరికింది. అక్కడ వారు తమ అభిరుచులను పంచుకున్నారు. చివరిలో వెళ్లిపోయేటపుడు ఆమె తన ఫోన్ నెంబర్ ఇచ్చింది. కానీ అందులో రెండు నంబర్స్ ని ఇవ్వకుండా.. కనుక్కోమని చెప్పింది. ఈ మొత్తం సంఘటన వివరాల్ని ఆ యువకుడి కజిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం తో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.

how this guy find his soulmates phone number..??

ట్విట్టర్ యూజర్ హాల్ తన కజిన్ కి, తనకు మధ్య జరిగిన చాట్ ని పోస్ట్ చేసి ఈ విషయాన్నీ సోషల్ మీడియా లో వెల్లడించాడు. అందులో అతను తన “సోల్‌మేట్”ని కలుసుకున్నట్లు చెప్పాడు. అతను ఆమె నంబర్ తీసుకున్నావా.. అని అతనిని అడిగినప్పుడు, అతను ఇలా సమాధానమిచ్చాడు. చాలా వరకు తీసుకున్నాను అని. ఆ తర్వాత ఆమె అతడికి రాసి ఇచ్చిన స్లిప్ ని ఫోటో తీసి పంపాడు. అందులో తన ఫోన్ నెంబర్ లో రెండు అంకెలను ఆమె రాయకుండా కనుక్కోమని అతడికి చెప్పింది.

how this guy find his soulmates phone number..??

దీంతో హాల్ కజిన్ ఆ ఫోన్ నెంబర్ కి ఉన్న అన్ని ప్రాబబిలిటీస్ ని ట్రై చేసి కనుక్కొనేందుకు ట్రై చేసాడు. దానికి సంబంధించిన ఫోటో ని కూడా హాల్ పోస్ట్ చేసాడు. హాల్ కజిన్ తాను పజిల్స్ ని బాగా సాల్వ్ చేస్తా అని చెప్పడం తో ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్వీట్ వైరల్ కావడం తో ఆ అమ్మాయి హాల్ ని సంప్రదించి అతడి కజిన్ ని తనని కలవమని కోరినట్లు హాల్ తెలిపాడు. ఏదేమైనా చివరికి హాల్ కజిన్ అతడి సోల్ మేట్ ని కలవడం తో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేసారు.

You may also like