ఎస్పీ బాలు గారు ఏ రోజున చనిపోతారు అని.. 3 ఏళ్ళ క్రితమే ఆ యూట్యూబ్ ఛానల్ ఎలా చెప్పారు.?

ఎస్పీ బాలు గారు ఏ రోజున చనిపోతారు అని.. 3 ఏళ్ళ క్రితమే ఆ యూట్యూబ్ ఛానల్ ఎలా చెప్పారు.?

by Anudeep

Ads

చావు పుట్టుకలను ఎవరు నిర్ణయించలేరు. మనం ఏ తేదీన గర్భం లోకి వచ్చామో ఎవరు చెప్పగలరు. ఎప్పుడు ఈ లోకాన్ని వీడిపోతామో ఎవరు ఊహించగలరు. కానీ ఎవరైనా ఒకళ్ళు ఫలానా తేదీ లో చనిపోతారు అని చెప్తే.. అది సరిగ్గా అలానే జరిగితే.. మనం ఎంతో ఆశ్చర్యపడుతూ ఉంటాం కదా.. ఐతే ఇలా ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసే యూట్యూబ్ ఛానల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

balasubramanyam 2

జనరల్ గా యూట్యూబ్ లో రకరకాల వీడియో లు వస్తుంటాయి. సినిమాలు, పాటలు, ట్రేండింగ్ లో ఉన్న టాపిక్స్.. ఇలా యు ట్యూబ్ లో వీడియో లకు అంతూపొంతూ లేదు. కొన్ని చానెల్స్ అయితే న్యూస్ ని కూడా చెప్తూ ఉంటాయి. కానీ.. “2020 విజన్” అనే యూట్యూబ్ ఛానల్ మాత్రం సెలెబ్రిటీల మరణాల గురించి ముందుగానే పోస్ట్ చేస్తోంది. అసలు ఇది ఎలా సాధ్యం అవుతోందో చూద్దాం.

s.P.bala subryamanya

ఈ ఛానల్ వారు ముందుగానే ఓ సెలెబ్రిటీ తాలూకు డెత్ గురించి ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు అన్ని తేదీలతోను వీడియోను క్రియేట్ చేసి అప్ లోడ్ చేస్తారు. ఆ తరువాత ప్రైవేట్ లో పెట్టేస్తారు. ఎవరైనా సెలెబ్రిటీ చనిపోయిన తరువాత.. వారి చనిపోయిన తేదీ తో ఈ వీడియో ను ఎడిట్ చేస్తారు. ఒక వీడియో అప్ లోడ్ చేసాక, దానిని ప్రైవేట్ లో పెట్టి, ఎడిట్ చేసి మళ్ళీ పబ్లిక్ లో పెట్టినపుడు ఆ వీడియో అప్ లోడ్ చేసిన తేదీ ఏదైతే ఉంటుందో.. అదే చూపిస్తుంది.

balasubramanyam 3

ఆ వీడియో ను ఎడిటెడ్ వీడియో అని చూపించదు. అందుకే వారు ఆ విషయాన్నీ ముందే చెప్పినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇలా దాదాపు అందరు సెలెబ్రిటీస్ తోనూ వారు వీడియోస్ చేసి పెట్టుకుని, ఎప్పటికప్పుడు ఎడిట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే, బాలు గారి వీడియో ను కూడా ఎడిట్ చేసి పబ్లిక్ లో పెట్టారు. అదన్నమాట అసలు సంగతి.

Watch Video:

 


End of Article

You may also like