దాదాపు ప్రతీ ఇంటిలో ఉండే సమస్య బల్లులు. బల్లుల కి కొంతమంది భయపడతారు మరికొంతమంది బల్లులను అసహ్యించుకుంటారు. ఏదేమైనా బల్లులను తరమడం మాత్రం చాలా కష్టం. దోమల కి ఆల్ అవుట్ లాగా బల్లులు పోవడానికి కూడా ఏమైనా లిక్విడ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మీకు ఒకటి తెలుసా? మనం ఇంట్లో వాడే పదార్థాలతో బల్లులను దూరం చేయొచ్చు. అది ఎలాగంటే.

Video Advertisement

 

ఒక ఉల్లిపాయ తీసుకోండి. దాన్ని ముక్కలుగా తరిగి మిక్సీ పట్టండి. అలా వచ్చిన మిశ్రమాన్ని జల్లెడలో వేసి ఉల్లిపాయ పిప్పి ని నీళ్ళని వేరు చేయండి. ఆ నీళ్లలో 8 లవంగాలు 10 మిరియాలు కలిపి దంచి చేసిన పొడిని కలపండి.

మామూలుగానే ఉల్లిపాయ ఘాటుగా ఉంటుంది అనుకుంటే మిరియాలు లవంగాలు కలపడంతో ఆ ఘాటు ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ ఘాటు ను మనుషులమే తట్టుకోలేము. ఇంక బల్లులు అయితే అస్సలు తట్టుకోలేవు.

ఒక మామూలు డెటాల్ సబ్బు ని ఒక చిన్న ముక్క కట్ చేసి ఆ నీళ్లలో కలపండి. డెటాల్ సబ్బు లేకపోతే డెటాల్ లిక్విడ్ అయినా వాడొచ్చు. ప్రత్యేకంగా డెటాల్ సబ్బు మాత్రమే ఎందుకు వాడాలి అంటే ఆ సబ్బుల లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మిగిలిన సబ్బుల కంటే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డెటాల్ సబ్బు ని మాత్రమే వాడాలి.

ఆ నీటిని ఒక బాటిల్ లో పోసి స్ప్రే చేయండి. లేదా ఒక చిన్న గిన్నెలో ఆ నీళ్లను తీసుకుని అందులో దూదిని ముంచి తలుపు చివర పెట్టండి. ఆ వాసనకు బల్లులే కాకుండా వేరే పురుగులు కూడా ఇంట్లోకి రావు. అలాగే నెమలీకలు కూడా గోడమీద అంటిస్తే బల్లుల బెడద కొంత వరకు తగ్గుతుంది. చూశారా ఇంట్లోనే సులభంగా తయారుచేసిన దానితో బల్లుల ని ఎలా తరిమికొట్టొచ్చో?