వంట గ్యాస్ సిలిండర్లకి “ఎక్స్పైరీ డేట్” ఉంటుందా..? అది తెలుసుకోవడం ఎలా అంటే..?

వంట గ్యాస్ సిలిండర్లకి “ఎక్స్పైరీ డేట్” ఉంటుందా..? అది తెలుసుకోవడం ఎలా అంటే..?

by kavitha

Ads

ప్రస్తుత కాలంలో వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ తప్పని సరిగా మారింది. పాత రోజుల్లో అయితే కట్టెల పొయ్యిని ఉపయోగించేవారు. ప్రస్తుతం పల్లెటూరులో కూడా కట్టెల పొయ్యి వాడకం తగ్గిపోయింది. ఎప్పుడైన పిండి వంటల కోసం  మాత్రమే కట్టెల పొయ్యిని వాడుతున్నారు.

Video Advertisement

ప్రస్తుతం అందరు వంట కోసం గ్యాస్ నే వాడుతున్నారు. మరి అలాంటి గ్యాస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తేనే క్షేమం. గ్యాస్ సిలిండర్ పై ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు. అయితే ఎక్స్పైరీ డేట్ ను ఎలా  తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ప్రతీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పైన దాని ఎక్స్పైరీ తేదీ ఉంటుంది. ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. గడువు దాటిన సిలిండర్లలో లీకేజీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి సిలిండర్ల వల్ల  ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సిలిండర్ పైన భాగంలో గుండ్రటి హ్యాండిల్ లాంటిది పట్టుకునేందుకు ఉంటుంది. దాని కింది వైపుగా సిలిండర్‌కు సపోర్ట్ గా 3 ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్ల లోపలి వైపున చూసినపుడు నంబర్స్ ఉండడం కనిపిస్తుంది. ఈ మూడింటిలో ఒక దాని మీద ఆ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ తేదీ ఉంటుంది.అలా దానిపైన ఒక ఇంగ్లీష్ అక్షరం మరియు నంబర్ ఉంటుంది. అవి సంవత్సరం మరియు నెలకు సంబంధించిన వివరాలను తెలుపుతుంది. ఒకవేళ  మీ ఇంట్లో ఉన్న సిలిండర్ పైన A 22 అని ఉంటే జనవరి నుండి మార్చి, 2022 వరకు అర్ధం. మార్చి ఆ సిలిండర్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇక B అంటే ఏప్రిల్ నుండి  జూన్ వరకు, C అంటే జూలై నుండి సెప్టెంబర్ వరకు, D అంటే అక్టోబర్ నుండి  డిసెంబర్ నెల వరకు అని అర్థం. ఇక నంబర్ సంవత్సరాన్ని తెలుపుతుంది.
గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చిన వెంటనే, దాని ఎక్స్పైరీ తేదీని చెక్ చేసుకొని తీసుకోవాలి. లేదంటే గడువు దాటిన సిలిండర్ లీకేజీల వల్ల పేలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సీల్ ను కూడా చెక్ చేసుకొని తీసుకోవాలి. సేఫ్టీ క్యాప్‌కు ఎలాంటి క్రాక్స్ ఉండకూడదని రూల్స్ చెబుతున్నాయి.

Also Read: ఫ్యాన్ వేగం తగ్గిపోయిందా..? కేవలం 70 రూపాయల ఖర్చుతో స్పీడ్ ను పెంచే సింపుల్ టిప్..!


End of Article

You may also like